ఎన్ఎస్ఎస్ డేను పురస్కరించుకుని అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు విశేషంగా నిలుస్తున్నాయి. కళాశాలలో మూడు ఎన్ఎస్ఎస్ యూనిట్లు పనిచేస్తుండగా, పీఓ వై. విజయలక్ష్మి, బి. లచ్చన్న, డాక్టర్ జి. సుధీర్ సేవలను సమన్వయం చేస్తున్నారు. 2025–26లో ఆర్.డుంబ్రిగూడ, రవ్వలగూడ, గద్యగూడ గ్రామాలను దత్తత తీసుకుని అవగాహన కార్యక్రమాలు, ఆరోగ్య శిబిరాలు, యోగా, స్వచ్ఛత కార్యక్రమాలు, మొక్కలు నాటడం, మట్టి వినాయక విగ్రహాల పంపిణీ, డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీలు నిర్వహించారు. ఉత్తమ ఎన్ఎస్ఎస్ పీఓగా విజయలక్ష్మి జిల్లా, ఆంధ్ర విశ్వవిద్యాలయ స్థాయి అవార్డులతో పాటు నేషనల్ సేవా ఐకాన్ అవార్డును అందుకున్నారు.

అరకు: ఎన్ఎస్ఎస్ సేవల్లో విజయలక్ష్మికి ప్రత్యేక గుర్తింపు