యూపీఐ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధించాలనే ప్రతిపాదనకు వ్యతిరేకంగా అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా ‘నో యూపీఐ డే’ పాటించాలని కొన్ని వ్యాపార సంఘాలు పిలుపునిచ్చాయి. ఆ రోజున డిజిటల్ చెల్లింపులు స్వీకరించకుండా నగదు లావాదేవీలకే ప్రాధాన్యం ఇవ్వాలని వ్యాపారులను కోరాయి.
నిరసనలో భాగంగా దుకాణాల వద్ద ఉన్న యూపీఐ స్కానర్లు, క్యూఆర్ కోడ్లను నల్లటి వస్త్రంతో కప్పాలని సూచించినట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి దేశంలోని వివిధ సంఘాలు మద్దతు ప్రకటించినట్లు మహారాష్ట్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ అండ్ అగ్రికల్చర్ అధ్యక్షుడు రవీంద్ర వెల్లడించారు. అయితే వినియోగదారులు ముందుగా అధికారిక బ్యాంకింగ్ ప్రకటనలను పరిశీలించడం మంచిది.

అక్టోబర్ 2న యూపీఐ లావాదేవులు నిలిచిపోతాయా?
యూపీఐ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధించాలనే ప్రతిపాదనకు వ్యతిరేకంగా అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా ‘నో యూపీఐ డే’ పాటించాలని కొన్ని వ్యాపార సంఘాలు పిలుపునిచ్చాయి. ఆ రోజున డిజిటల్ చెల్లింపులు స్వీకరించకుండా నగదు లావాదేవీలకే ప్రాధాన్యం ఇవ్వాలని వ్యాపారులను కోరాయి. నిరసనలో భాగంగా దుకాణాల వద్ద ఉన్న యూపీఐ స్కానర్లు, క్యూఆర్ కోడ్లను నల్లటి వస్త్రంతో కప్పాలని సూచించినట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి దేశంలోని వివిధ సంఘాలు మద్దతు ప్రకటించినట్లు మహారాష్ట్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ అండ్ అగ్రికల్చర్ అధ్యక్షుడు రవీంద్ర వెల్లడించారు. అయితే వినియోగదారులు ముందుగా అధికారిక బ్యాంకింగ్ ప్రకటనలను పరిశీలించడం మంచిది.

