APSPDCL ఛైర్మన్‌కు లేఖ రాసిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి
పున్నమి న్యూస్ ప్రతినిధి (ఆగస్టు 18) పులివెందుల: వై ఎస్ ఆర్ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను వెంటనే మంజూరు చేయాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు. విద్యుత్ పరికరాల కొరత, పెండింగ్ కనెక్షన్ల సమస్యపై APSPDCL ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్‌కు లేఖ రాసిన ఎంపీ, ఫోన్‌లో కూడా సమస్యపై చర్చించారు.
జిల్లా వ్యాప్తంగా సుమారు 1,800 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు నెలల తరబడి పెండింగ్‌లో ఉన్నాయని ఆయన తెలిపారు. రెండేళ్లుగా కనెక్షన్లు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
పెండింగ్ కనెక్షన్లకు అవసరమైన ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు, కండక్టర్లను వెంటనే విడుదల చేసి, రైతులకు విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయాలని APSPDCL అధికారులను వైఎస్ అవినాష్ రెడ్డి కోరారు.


