బంగారు గీతిక ఆచూకీ కోసం పోలీసుల గాలింపు.. సమాచారం ఉంటే వెంటనే తెలియజేయాలని తల్లిదండ్రుల విజ్ఞప్తి
పున్నమి ప్రతినిధి ఆనంద్ ( జిల్లా బ్యూరో)
పెద్దపల్లి: పెద్దపల్లి గ్రామానికి చెందిన బంగారు గీతిక (16) అనే ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. తండ్రి పేరు అప్పారావు. గీతిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అక్టోబర్ 1న ఉదయం 10 గంటలకు కాలేజీకి వెళ్లిన ఆమె సాయంత్రం ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ లభించకపోవడంతో రాత్రి 11 గంటలకు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
గీతిక పుట్టుకతోనే మాట్లాడలేని, వినికిడి లోపం ఉన్న బాలిక అని పోలీసులు తెలిపారు. ఇంటి నుంచి కాలేజీ యూనిఫామ్‌లో వెళ్లినట్లు పేర్కొన్నారు. ఆమె ఆచూకీ లేదా సంబంధిత సమాచారం తెలిసిన వారు 9490617629, 9440796104 నంబర్లకు వెంటనే సమాచారం అందించాలని పోలీసులు కోరారు.


