వార్త ముఖ్యాంశాలు
- ఉదయగిరి ట్యాంక్‌బండ్‌పై విషసర్పాల సంచారం పట్టణవాసులను భయాందోళనకు గురిచేస్తోంది.
- గత మూడు రోజుల వ్యవధిలోనే పదుల సంఖ్యలో పాములు కనిపించడంతో అటుగా వెళ్లే పాదచారులు, వాహనదారులు భయపడుతున్నారు.
- ముఖ్యంగా రాత్రివేళ వీధి దీపాలు లేకపోవడంతో పాములు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉదయగిరి ట్యాంక్‌బండ్‌పై విషసర్పాల సంచారం పట్టణవాసులను భయాందోళనకు గురిచేస్తోంది. గత మూడు రోజుల వ్యవధిలోనే పదుల సంఖ్యలో పాములు కనిపించడంతో అటుగా వెళ్లే పాదచారులు, వాహనదారులు భయపడుతున్నారు. ముఖ్యంగా రాత్రివేళ వీధి దీపాలు లేకపోవడంతో పాములు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి ట్యాంక్‌బండ్‌పై విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయడంతో పాటు విషసర్పాల సంచారాన్ని అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.