Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

యలమంచిలిలో మహిళ అదృశ్యం.. ఆచూకీ కోసం పోలీసుల విజ్ఞప్తి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
యలమంచిలిలో మహిళ అదృశ్యం.. ఆచూకీ కోసం పోలీసుల విజ్ఞప్తి

వార్త ముఖ్యాంశాలు

  • యలమంచిలి పట్టణంలో మహిళ అదృశ్యమైన ఘటన కలకలం రేపింది.
  • కోర్టు పేట, భాష్యం స్కూల్ సమీపంలో నివాసం ఉంటున్న ఉప్పులూరి సునీత (36) ఈ నెల 12వ తేదీ ఉదయం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు.
  • భర్త ఉప్పులూరు కిరణ్ కుమార్ మధ్యాహ్నం 1.20 గంటలకు ఇంటికి వచ్చి చూడగా ఆమె కనిపించలేదు.

యలమంచిలి పట్టణంలో మహిళ అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. కోర్టు పేట, భాష్యం స్కూల్ సమీపంలో నివాసం ఉంటున్న ఉప్పులూరి సునీత (36) ఈ నెల 12వ తేదీ ఉదయం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. భర్త ఉప్పులూరు కిరణ్ కుమార్ మధ్యాహ్నం 1.20 గంటలకు ఇంటికి వచ్చి చూడగా ఆమె కనిపించలేదు. దీంతో రైల్వే స్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్స్, పెంజేరువు ప్రాంతాలతో పాటు ఇతర తెలిసిన ప్రదేశాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. తల్లి, అన్నయ్య, బంధువులను విచారించినప్పటికీ ఆమె వారి వద్దకు వెళ్లినట్లు తెలియలేదు. దీంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేయగా, యలమంచిలి పట్టణ పోలీసులు మహిళ అదృశ్యమైనట్లు కేసు నమోదు చేశారు.అదృశ్యమైన సునీత తెలుపు రంగు కలిగి, సుమారు 5 అడుగుల 6 అంగుళాల ఎత్తు ఉంటుందని, చివరిగా బ్లూ, వైట్ రంగు చుడిదార్ ధరించిందని పోలీసులు తెలిపారు. మహిళ ఆచూకీ తెలిసినవారు లేదా ఎక్కడైనా కనిపిస్తే వెంటనే యలమంచిలి పట్టణ పోలీస్ స్టేషన్‌కు 9440796103 నంబర్‌కు సమాచారం అందించాలని ఎస్ఐ సావిత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

వార్తా మూలాలు

  • కె. ఆనంద్పత్రిక / వెబ్‌సైట్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *