అనపర్తి, అక్టోబరు 27 (పున్నమి ప్రతినిధి): స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఐకమత్యంతో ముందుకు సాగాలని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. అనపర్తి నియోజకవర్గంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు ఎమ్మెల్యే నల్లమిల్లి, టీడీపీ ఇన్చార్జి మనోజ్ బి-ఫారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని 75 ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ 51, జనసేన 13, బీజేపీ 11 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. జెడ్పీటీసీ స్థానాల్లో మూడు చోట్ల టీడీపీ, ఒక చోట జనసేన పోటీ చేస్తున్నట్లు వివరించారు. ఎంపీపీ స్థానాల్లో రెండు చోట్ల టీడీపీ, ఒక చోట జనసేన, మరో చోట బీజేపీ పోటీలో ఉన్నట్లు పేర్కొన్నారు. కూటమి పార్టీలన్నీ స్నేహపూర్వక వాతావరణంలో ఐకమత్యంతో ఎన్నికల్లో విజయం సాధించేందుకు కృషి చేస్తున్నాయని తెలిపారు. రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకెళ్లేందుకు డబుల్ ఇంజన్ ప్రభుత్వం కృషి చేస్తోందని, స్థానిక సంస్థల్లోనూ కూటమి అభ్యర్థులను గెలిపించి త్రిబుల్ ఇంజన్ ప్రభుత్వానికి సహకరించాలని ప్రజలను కోరారు. ఈ ఐకమత్యానికి సహకరించిన కూటమి నాయకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.





వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్