అనపర్తి, అక్టోబరు 27 (పున్నమి ప్రతినిధి): అనపర్తి జీబీఆర్ కళాశాల మైదానంలో వాకర్స్‌తో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సమావేశమయ్యారు. అనపర్తి జెడ్పీటీసీ, ఎంపీటీసీ కూటమి అభ్యర్థులతో కలిసి పాల్గొన్న ఆయన, రెండున్నరేళ్ల కాలంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతు తెలిపి విజయానికి సహకరించాలని వాకర్స్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ కూటమి అభ్యర్థులతో పాటు అనపర్తి మండలానికి చెందిన పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.





వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్