వార్త ముఖ్యాంశాలు
- Uploaded Video:
అనపర్తి నియోజకవర్గంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, టీడీపీ ఇన్చార్జి మనోజ్ బి-ఫారాలు అందజేశారు. 75 ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ 51, జనసేన 13, బీజేపీ 11 స్థానాల్లో పోటీ చేస్తున్నాయని నల్లమిల్లి తెలిపారు. నాలుగు జెడ్పీటీసీ స్థానాల్లో టీడీపీ మూడు, జనసేన ఒక స్థానంలో పోటీ చేస్తున్నాయని వివరించారు. ఎంపీపీ స్థానాల్లో టీడీపీ రెండు, జనసేన ఒకటి, బీజేపీ ఒక స్థానంలో పోటీ చేస్తున్నాయని పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో కూటమి అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి సహకరించాలని ప్రజలను కోరారు.
Uploaded Video:
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్