Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

పెదపూడి పాస్టర్స్ ఫెలోషిప్ సభ్యులతో ఎమ్మెల్యే నల్లమిల్లి సమావేశం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
పెదపూడి పాస్టర్స్ ఫెలోషిప్ సభ్యులతో ఎమ్మెల్యే నల్లమిల్లి సమావేశం

పెదపూడి, అక్టోబరు 27 (పున్నమి ప్రతినిధి): స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతు తెలిపి అభివృద్ధికి సహకరించాలని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కోరారు. పెదపూడిలో మండల పాస్టర్స్ ఫెలోషిప్ అసోసియేషన్ సభ్యులతో సమావేశమై, కూటమి ప్రభుత్వం రెండున్నరేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.

గతంలో రహదారుల దుస్థితితో ప్రజలు ఇబ్బందులు పడగా, ప్రస్తుతం గ్రామాలకు లింక్‌ రోడ్లను మెరుగుపరిచినట్లు తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు సంక్షేమం, పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. స్థానిక సంస్థల్లోనూ కూటమి అభ్యర్థులను గెలిపిస్తే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

పెదపూడి మండల జెడ్పీటీసీ అభ్యర్థిగా జనసేన తరఫున పోటీ చేస్తున్న రావాడ నాగుకు గాజు గుర్తుపై, ఎంపీటీసీ అభ్యర్థులకు వారి వారి ఎన్నికల గుర్తులపై ఓటు వేసి మద్దతు తెలపాలని ఎమ్మెల్యే కోరారు. మండలంలో 20 మంది ఎంపీటీసీ అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు తెలిపారు.

ఈ సమావేశంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ కూటమి అభ్యర్థులు, పాస్టర్స్ ఫెలోషిప్ అసోసియేషన్ సభ్యులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

పెదపూడి పాస్టర్స్ ఫెలోషిప్ సభ్యులతో ఎమ్మెల్యే నల్లమిల్లి సమావేశం

పెదపూడి పాస్టర్స్ ఫెలోషిప్ సభ్యులతో ఎమ్మెల్యే నల్లమిల్లి సమావేశం

పెదపూడి పాస్టర్స్ ఫెలోషిప్ సభ్యులతో ఎమ్మెల్యే నల్లమిల్లి సమావేశం

పెదపూడి పాస్టర్స్ ఫెలోషిప్ సభ్యులతో ఎమ్మెల్యే నల్లమిల్లి సమావేశం

పెదపూడి పాస్టర్స్ ఫెలోషిప్ సభ్యులతో ఎమ్మెల్యే నల్లమిల్లి సమావేశం

పెదపూడి పాస్టర్స్ ఫెలోషిప్ సభ్యులతో ఎమ్మెల్యే నల్లమిల్లి సమావేశం

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *