Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

ఒకేసారి నాలుగు బ్రహ్మకమలాలు వికాసం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఒకేసారి నాలుగు బ్రహ్మకమలాలు వికాసం

వార్త ముఖ్యాంశాలు

  • ఆహ్లాదకరమైన సువాసనతో ఆకట్టుకున్న అరుదైన పుష్పాలు పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో ) హరిపాలెం, అందలపల్లి: అరుదైన బ్రహ్మకమలం పుష్పాలు ఒకేసారి నాలుగు వికసించడంతో అందలపల్లిలోని ఓ ఇంటి పెరటి తోట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
  • గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు, ఎస్ఎస్ఎఫ్ సబ్ డివిజన్ కన్వీనర్ బి.వి.
  • రమణ పెరటి తోటలో ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది.

ఆహ్లాదకరమైన సువాసనతో ఆకట్టుకున్న అరుదైన పుష్పాలు

పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో )

హరిపాలెం, అందలపల్లి: అరుదైన బ్రహ్మకమలం పుష్పాలు ఒకేసారి నాలుగు వికసించడంతో అందలపల్లిలోని ఓ ఇంటి పెరటి తోట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు, ఎస్ఎస్ఎఫ్ సబ్ డివిజన్ కన్వీనర్ బి.వి. రమణ పెరటి తోటలో ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. మూడు సంవత్సరాల క్రితం తీర్థయాత్ర సందర్భంగా తీసుకొచ్చిన బ్రహ్మకమలం మొక్కను అప్పటి నుంచి ఎంతో శ్రద్ధగా సంరక్షిస్తున్నారు.
సాధారణంగా రాత్రివేళ వికసించే బ్రహ్మకమలం తెల్లని రేకులతో అందంగా కనిపించడమే కాకుండా, వికసించిన సమయంలో ఆహ్లాదకరమైన సువాసనను వెదజల్లుతుంది. రాత్రి సమయంలో పుష్పాలు పూర్తిగా విచ్చుకుని ఉదయం వరకు మాత్రమే అందంగా కనిపించడం దీని ప్రత్యేకత. ఒకేసారి నాలుగు పుష్పాలు వికసించడంతో స్థానికులు ఆసక్తిగా తిలకించారు.
భారతీయ సంప్రదాయాల్లో బ్రహ్మకమలానికి ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉందని భావిస్తారు. సరైన సంరక్షణతో ఇళ్ల పెరటి తోటల్లోనూ ఈ అరుదైన పుష్పాన్ని పెంచుకోవచ్చని రమణ తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *