Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

రైతు మృతిపై కరణం ధర్మశ్రీ ఆవేదన

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
రైతు మృతిపై కరణం ధర్మశ్రీ ఆవేదన

వార్త ముఖ్యాంశాలు

  • మృతదేహానికి గౌరవం ఇవ్వకుండా టెంట్‌ ఏర్పాటుకు అడ్డంకులా?
  • పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో ) రాంబిల్లి: మండలంలోని గొరపూడి పంచాయతీలో భూసేకరణ కార్యక్రమం సందర్భంగా చోటుచేసుకున్న తోపులాటలో రైతు గుండెపోటుతో మృతి చెందిన ఘటనపై యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
  • మృతి చెందిన రైతు కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన ఆయనకు..

మృతదేహానికి గౌరవం ఇవ్వకుండా టెంట్‌ ఏర్పాటుకు అడ్డంకులా?

పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో )

రాంబిల్లి: మండలంలోని గొరపూడి పంచాయతీలో భూసేకరణ కార్యక్రమం సందర్భంగా చోటుచేసుకున్న తోపులాటలో రైతు గుండెపోటుతో మృతి చెందిన ఘటనపై యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన రైతు కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన ఆయనకు.. అంత్యక్రియల సమయంలో టెంట్‌ ఏర్పాటు చేసుకునేందుకు అధికారులు, పోలీసులు అనుమతించలేదనే విషయం దృష్టికి వచ్చింది. దీంతో ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
రైతు మృతి చెందిన విషాద సమయంలోనైనా మానవత్వంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని ధర్మశ్రీ పేర్కొన్నారు. కనీసం అంత్యక్రియలకు టెంట్‌ ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఈ విషయంపై ఆర్డీవోతో ఫోన్‌లో మాట్లాడి అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. మృతి చెందిన రైతు కుటుంబానికి గౌరవం కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *