వార్త ముఖ్యాంశాలు
- స్మశానవాటిక దారికి చెత్త అడ్డంకి!
- పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో ) ఏటికొప్పాక గ్రామంలోని వరాహ నది బ్రిడ్జి కింద చెత్త, వ్యర్థ పదార్థాలను వేస్తుండటంతో స్మశానవాటికకు వెళ్లే దారి ఇబ్బందికరంగా మారిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- గ్రామంలో సేకరించిన చెత్తను పారిశుద్ధ్య కార్మికులు బ్రిడ్జి కిందకు తరలించి వేస్తుండటంతో అక్కడ వ్యర్థాలు పేరుకుపోతున్నాయని చెబుతున్నారు.
స్మశానవాటిక దారికి చెత్త అడ్డంకి!
పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో )
ఏటికొప్పాక గ్రామంలోని వరాహ నది బ్రిడ్జి కింద చెత్త, వ్యర్థ పదార్థాలను వేస్తుండటంతో స్మశానవాటికకు వెళ్లే దారి ఇబ్బందికరంగా మారిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో సేకరించిన చెత్తను పారిశుద్ధ్య కార్మికులు బ్రిడ్జి కిందకు తరలించి వేస్తుండటంతో అక్కడ వ్యర్థాలు పేరుకుపోతున్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా ఇదే మార్గం మీదుగా మృతదేహాలను స్మశానవాటికకు తరలిస్తుండగా, చెత్త కారణంగా వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోందని ప్రజలు పేర్కొంటున్నారు. దీంతో అత్యవసర సమయంలో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సంబంధిత పంచాయతీ అధికారులు, కార్యదర్శి వెంటనే స్పందించి బ్రిడ్జి కింద పేరుకుపోయిన చెత్తను తొలగించి మార్గాన్ని శుభ్రం చేయించాలని కోరుతున్నారు. చెత్తను ఇష్టానుసారంగా వేయకుండా డంపింగ్ యార్డు లేదా చెత్త నుంచి సంపద తయారీ కేంద్రానికి తరలించి శాస్త్రీయంగా నిర్వహించాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.