వార్త ముఖ్యాంశాలు
- పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: అప్పికొండ గణేష్ పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో ) అనకాపల్లి: పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా హేమగిరి సత్యనారాయణ స్వామి కొండపై గ్రీన్ క్లబ్ ఆధ్వర్యంలో సీడ్ బాల్స్ కార్యక్రమం నిర్వహించారు.
- ముఖ్య అతిథిగా దేవస్థానం చైర్మన్ అప్పికొండ గణేష్ పాల్గొని కొండ ప్రాంతంలో సీడ్ బాల్స్ వేశారు.
- ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అన్నారు.
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: అప్పికొండ గణేష్
పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో )
అనకాపల్లి: పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా హేమగిరి సత్యనారాయణ స్వామి కొండపై గ్రీన్ క్లబ్ ఆధ్వర్యంలో సీడ్ బాల్స్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా దేవస్థానం చైర్మన్ అప్పికొండ గణేష్ పాల్గొని కొండ ప్రాంతంలో సీడ్ బాల్స్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అన్నారు. సీడ్ బాల్స్ ద్వారా ఖాళీ ప్రదేశాల్లో సహజసిద్ధంగా మొక్కలు పెరిగేలా చేయవచ్చని తెలిపారు. భోగలింగేశ్వర దేవస్థానం చైర్మన్ కాండ్రేగుల సత్యనారాయణ, గ్రీన్ క్లబ్ వ్యవస్థాపకులు, వృక్షమిత్ర, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కొణతాల పణిభూషణ్ శ్రీధర్ పాల్గొన్నారు. “ఒక సీడ్ బాల్–ఒక మొక్కకు నాంది” అనే సందేశంతో కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. గ్రీన్ క్లబ్ సభ్యులు, మహిళా విభాగం ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేసి, నినాదాలతో ర్యాలీ నిర్వహించారు.