వార్త ముఖ్యాంశాలు
- పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో ) యలమంచిలి సెప్టెంబర్ 04: సమిద స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం నూతగుంటపాలెం లో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు.
- ఈ సందర్భంగా సుమారు 250 మందికి బీపీ, షుగర్ పరీక్షలతో పాటు వివిధ రకాల వ్యాధులకు వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందించారు.
- అలాగే సుమారు 250 మందికి ఐసీటీసీ ( ఐ సి టి సి) పరీక్షలు నిర్వహించారు.
పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో )
యలమంచిలి సెప్టెంబర్ 04: సమిద స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం నూతగుంటపాలెం లో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 250 మందికి బీపీ, షుగర్ పరీక్షలతో పాటు వివిధ రకాల వ్యాధులకు వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందించారు. అలాగే సుమారు 250 మందికి ఐసీటీసీ ( ఐ సి టి సి) పరీక్షలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సమిద స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి డి. వీరభద్రరావు, ప్రెసిడెంట్ పి. రమణ, ప్రోగ్రామ్ మేనేజర్ వరహాలు బాబు, ఎం&ఈ సంధ్యారాణి, ఏఎన్‌ఎం కే.లక్ష్మి, ఔట్రీచ్ వర్కర్లు కే.నాగు, సీహెచ్. బాల, టీ.నాగదుర్గ, కె. అనురాధ మెడికవర్ హాస్పిటల్స్ సిబ్బంది మరియు కూటమి నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు, ఆరోగ్య సేవలు అందించాలనే ఉద్దేశంతో నిర్వహించిన ఈ మెగా మెడికల్ క్యాంపునకు స్థానిక ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.