వార్త ముఖ్యాంశాలు
- పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో ) అనకాపల్లి, అక్టోబర్ 4: రాష్ట్ర హోంశాఖ మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత ఆదివారం అనకాపల్లిలోని శ్రీశ్రీశ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు.
- ఈ సందర్భంగా మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే శ్రీ కొణతాల రామకృష్ణ హోంమంత్రి అనితకు సాదర స్వాగతం పలికారు.
- అనంతరం దేవస్థానం సిబ్బంది పూర్ణకుంభంతో హోంమంత్రికి ఘన స్వాగతం పలికారు.
పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో )
అనకాపల్లి, అక్టోబర్ 4: రాష్ట్ర హోంశాఖ మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత ఆదివారం అనకాపల్లిలోని శ్రీశ్రీశ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే శ్రీ కొణతాల రామకృష్ణ హోంమంత్రి అనితకు సాదర స్వాగతం పలికారు.
అనంతరం దేవస్థానం సిబ్బంది పూర్ణకుంభంతో హోంమంత్రికి ఘన స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందించి సంప్రదాయబద్ధంగా పట్టు వస్త్రాలు అందజేశారు. అనంతరం హోంమంత్రి అమ్మవారి తీర్థప్రసాదాలను స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో నూకాంబిక అమ్మవారి దేవస్థానం చైర్మన్ శ్రీ పీల నాగశీను, ఆలయ ఈవో వై. శ్రీధర్, ఆలయ డైరెక్టర్లు, దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.