Pపల్నాడు : అమరావతి, పెద్దకూరపాడు సత్తెనపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ లను ఆకస్మికంగా తనిఖీ చేసిన పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ జగదీష్ ఆదహళ్లి ఐపీయస్ గారు.
రానున్న ఎన్నికలను అత్యంత పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించడమే లక్ష్యంగా ఆకస్మికంగా సందర్శించి, తనిఖీలు చేపట్టారు.
అమరావతి,పెద్దకూరపాడు, సత్తెనపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ లను మరియు చుట్టూ ఉన్న పరిసరాలను జిల్లా ఎస్పీ గారు పరిశీలించారు. అనంతరం స్టేషన్ లలోరికార్డ్స్ లను పరిశీలించి కేసుల నమోదు, వాటి యొక్క స్థితి గతులను తెలుసుకుని పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. స్టేషన్లులోని పరిధిలో శాంతి భద్రత ల గురించి ఆరాదిశారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటూ స్టేషన్లో పరిధిలో ఎలాంటి నేరాలు జరక్కుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ పోలీస్ శాఖపై మరింత నమ్మకం పెంపొందించేలా ఉత్తమ సేవలు అందించాలి.చట్టవ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా పెట్టి నివారించాలి.రానున్న స్థానిక ఎన్నికల నిమిత్తం సిబ్బందికి కేటాయించిన గ్రామాలలో వార్డు లో సమాచారాన్ని క్షేత్రస్థాయిలో సేకరిస్తూ ఎప్పటికప్పుడు పై అధికారులకు తెలియజేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి DSP చైతన్య గారు, అమరావతి CI Y. అచ్చయ్యా గారు, పెద్దకూరపాడు సర్కిల్ CI P. సురేష్ గారు, సత్తెనపల్లి టౌన్ CI నాగ మల్లేశ్వర రావు గారు, అమరావతి, పెద్దకూరపాడు, సత్తెనపల్లి టౌన్ SI లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.



