ప్రేమ సమాజంలో బీపీ, షుగర్ పరీక్షలు.. మందుల పంపిణీ
పున్నమి ప్రతినిధి ఆనంద్ (అనకాపల్లి జిల్లా బ్యూరో)
యలమంచిలి: అనకాపల్లి జిల్లా యలమంచిలి మున్సిపాలిటీ 23వ వార్డు కొక్కిరాపల్లి పరిధిలోని ప్రేమ సమాజం వద్ద నివసిస్తున్న వృద్ధులకు స్వర్ణ వార్డు సచివాలయానికి చెందిన ఏఎన్ఎం బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం వృద్ధులకు అవసరమైన వైద్య సలహాలు అందించడంతో పాటు మందులను పంపిణీ చేశారు. విధినిర్వహణలో భాగంగా ప్రతి నెలా ప్రేమ సమాజాన్ని సందర్శిస్తూ వృద్ధులకు వైద్య సేవలు అందిస్తున్న ఏఎన్ఎం సేవలను ప్రేమ సమాజం వ్యవస్థాపకులు పి. రామకృష్ణ అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.


