*విజయవాడ ప్రతిష్ట కీర్తించేలా విజయవాడ ఉత్సవ్ సీజన్- 2*
కర్టెన్ రైజర్ వేడుకలతో మంత్రి దుర్గేష్, ప్రముఖులతో కలిసి పాల్గొన్న జంపాల సీతారామయ్య గారు
విజయవాడ ప్రతిష్ట కీర్తించేలా విజయవాడ ఉత్సవ్ సీజన్- 2 ఉండబోతుందని అశాభావం వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జంపాల సీతారామయ్య గారు. విజయవాడ ఉత్సవ్ సీజన్ -2 కర్టెన్ రైజర్ వేడుకలు విజయవాడ అంబేద్కర్ కళావేదికలో సోమవారం అట్టహాసంగా నిర్వహించారు. విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) సారథ్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి విజయవాడ ప్రముఖుల, ప్రజా ప్రతినిధులతో పాటు కలిసి పాల్గొన్నారు జంపాల సీతారామయ్య గారు… రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి మంత్రి కందుల దుర్గేష్ తో పాటు ప్రముఖులకు ప్రజాప్రతినిధులకు స్వాగతం పలికారు. అనంతరం కార్యక్రమం అధ్యంతం చురుగ్గా పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ప్రముఖులు విజయవాడ ఉత్సవ్ సీజన్ 2 విజయవాడ ప్రేక్షకులకు మరింత ఆనందాన్ని ఇవ్వాలని… ఈ పండగ రెట్టింపు ఉత్సాహంతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఉత్సవ్ టు కార్యక్రమ వివరాలతో కూడిన పోస్టర్ను ఆవిష్కరించారు.




