పున్నమి ప్రతినిధి ఆనంద్ ( జిల్లా బ్యూరో )
ఏఎంఆర్ పేరుతో నిర్వహిస్తున్న అక్రమ చెక్‌పోస్టులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ మాటూరు జంక్షన్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఆందోళనను గమనించిన ఏఎంఆర్ సిబ్బందిలో కొంతమంది అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు ఆందోళనకారులు తెలిపారు. చెక్‌పోస్టు సిబ్బందిని అక్రమ వసూళ్లపై ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వలేదని పేర్కొన్నారు.ఈ సందర్భంగా మాజీ ఇంటెలిజెన్స్ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఏఎంఆర్ చెక్‌పోస్టులు అక్రమమని, ఎలాంటి వసూళ్లు చేయడానికి వీలులేదని అన్నారు. ఈ వ్యవహారంపై తీవ్రంగా ఖండిస్తున్నామని, అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో అక్రమ కార్యకలాపాలకు పాలక, ప్రతిపక్షాలు కుమ్మక్కవుతున్నాయంటూ ఆయన విమర్శలు చేశారు. అధికారులు వెంటనే స్పందించి అక్రమ మైనింగ్‌ను అడ్డుకోవాలని, లేకుంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే హైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు.
ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లపై దౌర్జన్యం సీపీఎం మండల కన్వీనర్ గంటా శ్రీరామ్ మాట్లాడుతూ ఏఎంఆర్ సిబ్బంది ట్రాక్టర్ డ్రైవర్లపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేదన్నారు. రోజువారీ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లు మైనింగ్ మాఫియా దౌర్జన్యాలకు బలవుతున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వ పెద్దల సహకారంతోనే అక్రమ మైనింగ్ జరుగుతోందని ఆయన విమర్శించారు.ఈ కార్యక్రమంలో నల్లమోతు చక్రవర్తి, అజయ్ మల్లారెడ్డి, గంటా శ్రీరామ్, మొల్


