వార్త ముఖ్యాంశాలు
- ఎలమంచిలిలో విషాద ఘటన..
- ప్రమాదవశాత్తు జరిగిందా?
- పోలీసుల దర్యాప్తు పున్నమి ప్రతినిధి ఆనంద్ (అనకాపల్లి జిల్లా బ్యూరో) యలమంచిలి: ఎలమంచిలి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వీరభద్రస్వామి గుడి సమీపంలో శుక్రవారం రాత్రి విషాద ఘటన చోటుచేసుకుంది.
ఎలమంచిలిలో విషాద ఘటన.. ప్రమాదవశాత్తు జరిగిందా? పోలీసుల దర్యాప్తు
పున్నమి ప్రతినిధి ఆనంద్ (అనకాపల్లి జిల్లా బ్యూరో)
యలమంచిలి: ఎలమంచిలి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వీరభద్రస్వామి గుడి సమీపంలో శుక్రవారం రాత్రి విషాద ఘటన చోటుచేసుకుంది. కోరుకొండ సన్యాసమ్మ (65) ఇంట్లో ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకుని మృతి చెందారు. రాత్రి సుమారు 11.30 గంటలకు ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతురాలి బంధువు కిల్లాడి చిన్నా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. సన్యాసమ్మకు చుట్ట తాగే అలవాటు ఉండేదని, తరచూ మంచంపై పడుకుని దుప్పటి కప్పుకుని చుట్ట కాల్చుకునేవారని కుటుంబ సభ్యులు తెలిపారు. చుట్ట నుంచి దుప్పటికి మంటలు అంటుకోవడంతో ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.