11 రోజుల పూజల అనంతరం అంగరంగ వైభవంగా శోభాయాత్ర మహారాష్ట్రతో పాటు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు లోకేశ్వరం మండలంలోని అబ్దుల్లాపూర్ గ్రామంలో కొలువుదీరిన మోక్ష కర్ర గణపతికి 11 రోజులపాటు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించిన అనంతరం ఘనంగా వీడ్కోలు పలికారు. నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామంలో భక్తి వాతావరణం నెలకొంది.11 రోజులపాటు మోక్ష గణపతికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు, అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాలతో పాటు మహారాష్ట్ర నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పాడిపంటలు సమృద్ధిగా పండాలని, వ్యాపారాలు అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని భక్తులు ప్రార్థించారు.
నిమజ్జన కార్యక్రమంలో భాగంగా మోక్ష గణపతిని ప్రత్యేకంగా అలంకరించి భాజాభజంత్రీలు, మంగళవాయిద్యాల నడుమ గ్రామ పురవీధుల్లో ఘనంగా ఊరేగించారు. భక్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి ఘనంగా వీడ్కోలు పలికారు.
మోక్ష గణపతికి భక్తిశ్రద్ధలతో ఘన వీడ్కోలు
11 రోజుల పూజల అనంతరం అంగరంగ వైభవంగా శోభాయాత్ర మహారాష్ట్రతో పాటు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు లోకేశ్వరం మండలంలోని అబ్దుల్లాపూర్ గ్రామంలో కొలువుదీరిన మోక్ష కర్ర గణపతికి 11 రోజులపాటు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించిన అనంతరం ఘనంగా వీడ్కోలు పలికారు. నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామంలో భక్తి వాతావరణం నెలకొంది.11 రోజులపాటు మోక్ష గణపతికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు, అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాలతో పాటు మహారాష్ట్ర నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పాడిపంటలు సమృద్ధిగా పండాలని, వ్యాపారాలు అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని భక్తులు ప్రార్థించారు. నిమజ్జన కార్యక్రమంలో భాగంగా మోక్ష గణపతిని ప్రత్యేకంగా అలంకరించి భాజాభజంత్రీలు, మంగళవాయిద్యాల నడుమ గ్రామ పురవీధుల్లో ఘనంగా ఊరేగించారు. భక్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి ఘనంగా వీడ్కోలు పలికారు.

