⛔స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర అంటూ వేల రూపాయల ప్రజాధనాన్ని నీళ్లలా ఖర్చు??
పున్నమి న్యూస్ తడ
తిరుపతి జిల్లా తడ మండలం కారిజాత గ్రామంలో పారిశుధ్యం పడకేసింది.వీధి వీధినా చెత్త కుప్పలు తెప్పలుగా పేరుకుపోతుంటే… ప్రజలు రోగాల బారిన పడుతుంటే అడిగే నాథుడే కరువయ్యాడు.గత రెండు, మూడు నెలలుగా ఇక్కడ జరుగుతున్న భాగవతం అంతా ఇదే….. రోజూ ఉదయాన్నే రావడం, ఏదో ఒక మూల నిలబడి ఓ ఫోటో క్లిక్ అనిపించడం, పైఅధికారులకు వాట్సాప్లో పంపేసి డ్యూటీ అయిపోయిందని బోర్డు తిప్పేయడం. పంచాయతీ పాలనను పర్యవేక్షించాల్సిన పంచాయతీ కార్యదర్శి ఏ నిద్రమత్తులో ఉన్నారు. నెలకు జీతాలు, చేతికి ముడుపులు అందుతుంటే… గ్రామం ఏమైపోతే మాకేంటి అన్నట్లు సెక్రటరీ వ్యవహరిస్తుండటంతోనే పారిశుధ్య సిబ్బందికి ఈ స్థాయిలో తెగింపు వచ్చిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఎన్నాళ్లీ నాటకాలు ఫోటోలకు ఇచ్చే ప్రాధాన్యం మా ప్రాణాలకు ఇవ్వరా. ప్రజాధనాన్ని ఇలా నెల నెల ముడుపుల రూపంలో దోచేస్తుంటే మేము చూస్తూ ఊరుకోవాలా అనీ కారిజాత గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు…. నివేదికల్లో వచ్చే ఫోటోలు చూసి కలరింగ్ ఇవ్వడం కాదు… ఒక్కసారి ఏసీ గదుల నుంచి బయటకు వచ్చి కారిజాత గ్రామంలో అడుగుపెట్టండి. అసలు సిబ్బంది డ్యూటీ చేస్తున్నారా. ఆ వీధి ముఖం చూస్తున్నారా లేదా అని గ్రామంలోని ప్రతీ ఇంటినీ అడిగి తెలుసుకోండి. క్షేత్రస్థాయిలో విచారణ జరిపి… ఈ దొంగ ఫోటోల భాగవతానికి, నిధుల దుర్వినియోగానికి బాధ్యులైన పంచాయతీ కార్యదర్శి మరియు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.


