Friday, 25 September 2026
  • Home  
  • మహిళల, చిన్నారుల రక్షణే ధ్యేయం.. ‘శక్తి’ యాప్‌తో అభయం
- అన్నమయ్య

మహిళల, చిన్నారుల రక్షణే ధ్యేయం.. ‘శక్తి’ యాప్‌తో అభయం

మహిళల, చిన్నారుల రక్షణే ధ్యేయం.. ‘శక్తి’ యాప్‌తో అభయం 🔹 జిల్లావ్యాప్తంగా శక్తి బృందాల ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు 🔹 సోషల్ మీడియా ప్రమాదాలు, సైబర్ నేరాలపై విద్యార్థినులు, మహిళలకు ప్రత్యేక అవగాహన జిల్లాలో మహిళలు, విద్యార్థినులు, చిన్నారుల భద్రతే పరమావధిగా జిల్లా పోలీస్ యంత్రాంగం సరికొత్త వ్యూహాలతో ముందుకు సాగుతోంది. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న తరుణంలో పొంచి ఉన్న ముప్పులు, సైబర్ నేరాల ఉచ్చుపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించేందుకు జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్, IPS గారి ఆదేశాల మేరకు ఈరోజు జిల్లాలోని అన్ని సబ్ డివిజన్ల పరిధిలోని ‘శక్తి’ బృందాలు విస్తృతంగా రంగంలోకి దిగాయి. 🏫 పాఠశాలలు, కళాశాలలు, ప్రధాన కూడళ్లలో ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించి మహిళలు, విద్యార్థినుల్లో ధైర్యాన్ని నింపాయి. 📱 సోషల్ మీడియా.. డిజిటల్ వల పట్ల జాగ్రత్త 🔸 వాట్సప్ (WhatsApp) ప్రొఫైల్ పిక్చర్స్ (DP) అందరికీ కనిపించేలా బహిరంగంగా ఉంచడం వల్ల ఎదురయ్యే ప్రమాదాలను శక్తి బృందాలు వివరించాయి. 🔸 ఇన్‌స్టాగ్రామ్ (Instagram) రీల్స్ మోజులో పడి అపరిచిత వ్యక్తులతో ఫొటోలు, సెల్ఫీలు దిగడం ఎంత ప్రమాదకరమో హెచ్చరించారు. 🔸 ఇలాంటి ఫొటోలను ఆధునిక సాంకేతికత సహాయంతో ‘మార్ఫింగ్’ చేసి, ఆపై బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడే సైకోల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. 🛡️ రక్షణ కవచం.. ‘శక్తి యాప్’ & ఎమర్జెన్సీ నంబర్లు 📲 ఆపద సమయంలో తక్షణ సహాయం అందించే సాధనం ‘Shakti App’ అని, ప్రతి మహిళా దీనిని తమ మొబైల్స్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. 🌙 నైట్ షెల్టర్ సేవలు: రాత్రి సమయాల్లో ఒంటరిగా ప్రయాణించే మహిళలు ఆపదలో ఉంటే యాప్‌లోని ‘నైట్ షెల్టర్’ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని వివరించారు. 🆘 SOS ఫీచర్: రాత్రి వేళల్లో ప్రయాణించేటప్పుడు ఆటో లేదా ఇతర వాహన చోదకుల ప్రవర్తన అనుమానాస్పదంగా అనిపిస్తే.. వెంటనే యాప్‌లోని SOS బటన్‌ను ప్రెస్ చేయడం ద్వారా పోలీస్ కంట్రోల్ రూమ్‌ను ఎలా అప్రమత్తం చేయాలో ప్రయోగాత్మకంగా చేసి చూపించారు. ☎️ అత్యవసర పరిస్థితుల్లో Dial 100 / 112, చిన్నారుల రక్షణకు 1098, మహిళల కోసం 181 హెల్ప్‌లైన్ నంబర్లను ఎప్పుడైనా సంప్రదించవచ్చని తెలిపారు. 🥋 స్వీయ రక్షణ – వ్యసనాలకు దూరం చిన్నారులు, మహిళలపై జరిగే వివిధ రకాల నేరాలపై అవగాహన కల్పిస్తూనే, ఆకస్మిక ముప్పు ఎదురైనప్పుడు తమను తాము ఎలా కాపాడుకోవాలో సెల్ఫ్ డిఫెన్స్ (ఆత్మరక్షణ) మెళకువలను ప్రదర్శించి చూపించారు. అదే సమయంలో యువతను పెడదోవ పట్టిస్తున్న డ్రగ్స్ (మాదకద్రవ్యాల) అలవాట్ల వల్ల జరిగే అనర్థాలను వివరిస్తూ, వాటికి దూరంగా ఉండాలని కౌన్సిలింగ్ ఇచ్చారు. 🚨 సైబర్ ఉచ్చు.. నకిలీ ఫోన్ కాల్స్ 📞 బ్యాంకుల నుంచి మాట్లాడుతున్నామంటూ క్రెడిట్/డెబిట్ కార్డుల పేరుతో వచ్చే నకిలీ (Fake) ఫోన్ కాల్స్‌ను నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. 🔐 ఏటీఎం మోసాలు, ఓటీపీ (OTP) లూటీలు, ఆధునిక సైబర్ నేరాల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండడమే శ్రీరామరక్ష అని పిలుపునిచ్చారు. 👮‍♀️ శక్తి బృందాలు మీ భద్రత కోసం.. ఎల్లప్పుడూ మీ వెంటే! అప్రమత్తతే రక్షణ.. అవగాహనే ఆయుధం..

మహిళల, చిన్నారుల రక్షణే ధ్యేయం.. ‘శక్తి’ యాప్‌తో అభయం
🔹 జిల్లావ్యాప్తంగా శక్తి బృందాల ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు
🔹 సోషల్ మీడియా ప్రమాదాలు, సైబర్ నేరాలపై విద్యార్థినులు, మహిళలకు ప్రత్యేక అవగాహన
జిల్లాలో మహిళలు, విద్యార్థినులు, చిన్నారుల భద్రతే పరమావధిగా జిల్లా పోలీస్ యంత్రాంగం సరికొత్త వ్యూహాలతో ముందుకు సాగుతోంది.
సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న తరుణంలో పొంచి ఉన్న ముప్పులు, సైబర్ నేరాల ఉచ్చుపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించేందుకు జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్, IPS గారి ఆదేశాల మేరకు ఈరోజు జిల్లాలోని అన్ని సబ్ డివిజన్ల పరిధిలోని ‘శక్తి’ బృందాలు విస్తృతంగా రంగంలోకి దిగాయి.
🏫 పాఠశాలలు, కళాశాలలు, ప్రధాన కూడళ్లలో ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించి మహిళలు, విద్యార్థినుల్లో ధైర్యాన్ని నింపాయి.
📱 సోషల్ మీడియా.. డిజిటల్ వల పట్ల జాగ్రత్త
🔸 వాట్సప్ (WhatsApp) ప్రొఫైల్ పిక్చర్స్ (DP) అందరికీ కనిపించేలా బహిరంగంగా ఉంచడం వల్ల ఎదురయ్యే ప్రమాదాలను శక్తి బృందాలు వివరించాయి.
🔸 ఇన్‌స్టాగ్రామ్ (Instagram) రీల్స్ మోజులో పడి అపరిచిత వ్యక్తులతో ఫొటోలు, సెల్ఫీలు దిగడం ఎంత ప్రమాదకరమో హెచ్చరించారు.
🔸 ఇలాంటి ఫొటోలను ఆధునిక సాంకేతికత సహాయంతో ‘మార్ఫింగ్’ చేసి, ఆపై బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడే సైకోల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.
🛡️ రక్షణ కవచం.. ‘శక్తి యాప్’ & ఎమర్జెన్సీ నంబర్లు
📲 ఆపద సమయంలో తక్షణ సహాయం అందించే సాధనం ‘Shakti App’ అని, ప్రతి మహిళా దీనిని తమ మొబైల్స్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.
🌙 నైట్ షెల్టర్ సేవలు:
రాత్రి సమయాల్లో ఒంటరిగా ప్రయాణించే మహిళలు ఆపదలో ఉంటే యాప్‌లోని ‘నైట్ షెల్టర్’ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని వివరించారు.
🆘 SOS ఫీచర్:
రాత్రి వేళల్లో ప్రయాణించేటప్పుడు ఆటో లేదా ఇతర వాహన చోదకుల ప్రవర్తన అనుమానాస్పదంగా అనిపిస్తే.. వెంటనే యాప్‌లోని SOS బటన్‌ను ప్రెస్ చేయడం ద్వారా పోలీస్ కంట్రోల్ రూమ్‌ను ఎలా అప్రమత్తం చేయాలో ప్రయోగాత్మకంగా చేసి చూపించారు.
☎️ అత్యవసర పరిస్థితుల్లో Dial 100 / 112, చిన్నారుల రక్షణకు 1098, మహిళల కోసం 181 హెల్ప్‌లైన్ నంబర్లను ఎప్పుడైనా సంప్రదించవచ్చని తెలిపారు.
🥋 స్వీయ రక్షణ – వ్యసనాలకు దూరం
చిన్నారులు, మహిళలపై జరిగే వివిధ రకాల నేరాలపై అవగాహన కల్పిస్తూనే, ఆకస్మిక ముప్పు ఎదురైనప్పుడు తమను తాము ఎలా కాపాడుకోవాలో సెల్ఫ్ డిఫెన్స్ (ఆత్మరక్షణ) మెళకువలను ప్రదర్శించి చూపించారు.
అదే సమయంలో యువతను పెడదోవ పట్టిస్తున్న డ్రగ్స్ (మాదకద్రవ్యాల) అలవాట్ల వల్ల జరిగే అనర్థాలను వివరిస్తూ, వాటికి దూరంగా ఉండాలని కౌన్సిలింగ్ ఇచ్చారు.
🚨 సైబర్ ఉచ్చు.. నకిలీ ఫోన్ కాల్స్
📞 బ్యాంకుల నుంచి మాట్లాడుతున్నామంటూ క్రెడిట్/డెబిట్ కార్డుల పేరుతో వచ్చే నకిలీ (Fake) ఫోన్ కాల్స్‌ను నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు.
🔐 ఏటీఎం మోసాలు, ఓటీపీ (OTP) లూటీలు, ఆధునిక సైబర్ నేరాల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండడమే శ్రీరామరక్ష అని పిలుపునిచ్చారు.
👮‍♀️ శక్తి బృందాలు మీ భద్రత కోసం.. ఎల్లప్పుడూ మీ వెంటే!
అప్రమత్తతే రక్షణ.. అవగాహనే ఆయుధం..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.