Friday, 25 September 2026
  • Home  
  • నాగోల్‌లో ఘనంగా శ్రీ నాగ భూషణ భక్త సమాజం శ్రీ గణేష్ ఉత్సవాల 78వ వార్షికోత్సవాలు
- రంగారెడ్డి

నాగోల్‌లో ఘనంగా శ్రీ నాగ భూషణ భక్త సమాజం శ్రీ గణేష్ ఉత్సవాల 78వ వార్షికోత్సవాలు

నాగోల్: నాగోల్‌లోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో శ్రీ నాగ భూషణ భక్త సమాజం ఆధ్వర్యంలో శ్రీ గణేష్ ఉత్సవాల 78వ వార్షికోత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నప్రసాద కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సుమారు 5,000 మందికి పైగా భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శ్రీ నాగ భూషణ భక్త సమాజం కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉత్సవాలు భక్తుల సందడితో ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగాయి. ఈ కార్యక్రమంలో శ్రీ నాగ భూషణ భక్త సమాజం కమిటీ సభ్యులు బద్దం సత్యనారాయణ గౌడ్, బద్దం ధనుంజయ్ గౌడ్, బద్దం మనోహర్ గౌడ్, రావుల సాయి గౌడ్, బద్దం ఆనంద్ గౌడ్, చెరుకు యుగేందర్ గౌడ్, బద్దం ప్రసాద్, కాందికంటి శివ, నలపాటి రాకేశ్, రావుల రంజిత్ గౌడ్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

నాగోల్: నాగోల్‌లోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో శ్రీ నాగ భూషణ భక్త సమాజం ఆధ్వర్యంలో శ్రీ గణేష్ ఉత్సవాల 78వ వార్షికోత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నప్రసాద కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సుమారు 5,000 మందికి పైగా భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శ్రీ నాగ భూషణ భక్త సమాజం కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉత్సవాలు భక్తుల సందడితో ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగాయి.

ఈ కార్యక్రమంలో శ్రీ నాగ భూషణ భక్త సమాజం కమిటీ సభ్యులు బద్దం సత్యనారాయణ గౌడ్, బద్దం ధనుంజయ్ గౌడ్, బద్దం మనోహర్ గౌడ్, రావుల సాయి గౌడ్, బద్దం ఆనంద్ గౌడ్, చెరుకు యుగేందర్ గౌడ్, బద్దం ప్రసాద్, కాందికంటి శివ, నలపాటి రాకేశ్, రావుల రంజిత్ గౌడ్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.