ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటనకు ముందు రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై కీలక సంకేతాలు వెలువడ్డాయి. భారత వైమానిక దళం కోసం ప్రతిపాదించిన 114 రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందం ‘మేక్ ఇన్ ఇండియా’ విధానానికి అనుగుణంగా ఉండబోతుందని ఫ్రాన్స్ తెలిపింది. గత ఒప్పందాల మాదిరిగా కాకుండా, ఈసారి సంయుక్త అభివృద్ధి మరియు పారిశ్రామిక సహకారానికి ప్రాధాన్యం ఇస్తామని ఫ్రెంచ్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఒప్పందం విలువ సుమారు ₹3.25 లక్షల కోట్లుగా అంచనా వేస్తున్నారు. రక్షణ రంగంలో భారత్-ఫ్రాన్స్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యమని అధికారులు తెలిపారు. ఇరు దేశాల మధ్య అణుశక్తి సహకారంపై కూడా చర్చలు జరిగే అవకాశం ఉంది.

రఫేల్ ఒప్పందంలో ‘మేక్ ఇన్ ఇండియా’కు ఫ్రాన్స్ మద్దతు