Friday, 25 September 2026
  • Home  
  • దోప్పర్లలో ‘పల్లె నిద్ర’.. పోలీసుల అవగాహన
- అనకాపల్లి

దోప్పర్లలో ‘పల్లె నిద్ర’.. పోలీసుల అవగాహన

డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి.. యువత భవిష్యత్తును కాపాడాలి పున్నమి ప్రతినిధి ఆనంద్ ( అనకాపల్లి జిల్లా బ్యూరో ) దోప్పర్ల గ్రామంలో బుధవారం రాత్రి నిర్వహించిన ‘పల్లె నిద్ర’ కార్యక్రమంలో సీఐ, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని గ్రామ ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా ‘డ్రగ్స్‌–యువత భవిష్యత్తు’ అంశంపై చర్చిస్తూ మాదకద్రవ్యాలకు యువత పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్‌ బారిన పడితే జీవితమే ప్రమాదంలో పడే అవకాశం ఉందని, యువత చెడు వ్యసనాలకు లోనుకాకుండా తల్లిదండ్రులు కూడా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. డ్రంకెన్ డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని, రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని సూచించారు. ఎన్నికల సమయంలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా, ఇతర అసాంఘిక చర్యల్లో పాల్గొన్నా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. కార్యక్రమం ద్వారా యువతకు అందించిన సందేశం ఎంతో ప్రయోజనకరమని గ్రామస్థులు పేర్కొన్నారు.

డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి.. యువత భవిష్యత్తును కాపాడాలి

పున్నమి ప్రతినిధి ఆనంద్ ( అనకాపల్లి జిల్లా బ్యూరో )

దోప్పర్ల గ్రామంలో బుధవారం రాత్రి నిర్వహించిన ‘పల్లె నిద్ర’ కార్యక్రమంలో సీఐ, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని గ్రామ ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా ‘డ్రగ్స్‌–యువత భవిష్యత్తు’ అంశంపై చర్చిస్తూ మాదకద్రవ్యాలకు యువత పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్‌ బారిన పడితే జీవితమే ప్రమాదంలో పడే అవకాశం ఉందని, యువత చెడు వ్యసనాలకు లోనుకాకుండా తల్లిదండ్రులు కూడా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. డ్రంకెన్ డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని, రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని సూచించారు. ఎన్నికల సమయంలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా, ఇతర అసాంఘిక చర్యల్లో పాల్గొన్నా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. కార్యక్రమం ద్వారా యువతకు అందించిన సందేశం ఎంతో ప్రయోజనకరమని గ్రామస్థులు పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.