Friday, 11 July 2025

గొప్ప పరిశోధకుడు ఉస్తాద్ ఖాదర్ మోహియుద్దీన్ ——————— రచన-ఫయాజ్ ——————— (పున్నమి    భలే జ్ఞాపకాలు) “ఏమయ్యా కొండయ్య?, నేను ఇచ్చిన కాటుక పెట్టుకున్నావా? ఇప్పుడు కళ్ళకు ఎలా కనిపిస్తోంది?” “చాలా బాగా కనిపిస్తుంద య్యా, ఇంతకు ముందు నా కళ్ళ ముందు రెండు తెరలు అడ్డంగా ఉండి ప్రతి వస్తువు లీలామాత్రం గానే కనిపించేది. ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేనయ్యా” ఈ సంభాషణ మీకు అర్థం కాలేదు కదూ? 70 ఏళ్ల కిందట ఉదయగిరిలో జరిగిన సంఘటన ఇది. ఒక వ్యక్తికి రెండు కళ్ళకు కేటరాక్ట్ వచ్చింది. వెంటనే ఉదయగిరి లోని గొప్ప వైద్యుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఉస్తాద్ ఖాదర్ మోహియుద్దీన్ ను సంప్రదించాడు. ఆయన ఒక కాటుకను తయారు చేసి ఇచ్చారు. దాని మూలంగా కంటి ముందు ఉన్న కాటరాక్ట్ పొరలు తొలగి పోయాయి. చూపు స్పష్టంగా వచ్చింది. మరో సంఘటన “ఏమమ్మా రసూల్ బి?, నువ్వు అడిగిన దానికి మందిచ్చా గదా. అది పని చేసిందా?, మళ్లీ ఎందు కొచ్చావు?” “అయ్యా మీరిచ్చిన మందు చాలా బాగా పని చేసింది. నా బిడ్డకు కడుపునిండా పాలివ్వగలుగుతున్నా. అయితే పాలిచ్చిన తర్వాత కూడా పాలు ఆగడం లేదు. నా రవిక తడిసిపోతోంది.ఏం చేయాలి”?. “సరే రేపు రా. దానికి పరిష్కారం చెబుతా.” ఉదయగిరి లోని దిలావర్ భాయ్ వీధికి చెందిన ఈ మహిళకు కాన్పు తర్వాత పాలు రాలేదు. అందుకని ఆమె ఉస్తాద్ ను సంప్రదించారు. ఇలా ఉదయగిరి పట్టణంలోనూ, చుట్టుపక్కల బద్వేలు, కనిగిరి, కావలి, ఆత్మకూరు తాలూకాల్లో ఇతర ప్రాంతాల్లో అంతు పట్టని ఏ రోగమొచ్చినా ఉస్తాద్ (గురువు గారు) ని సంప్రదించి ఉచితంగా వైద్యం పొందేవారు. అరుదైన రోగాలకు సైతం ఆయన మందులిచ్చేవారు. ఈ విషయంలో ఆయన కొన్ని పరిశోధనలు సైతం చేశారు. తాను చేసిన పరిశోధనా ఫలితాలను పుస్తకాల రూపంలో రాశారు. ఆయన మూలికల కోసం ఉదయగిరి దుర్గం మీద రెండు మూడు రోజులు ఉండేవారట. కొన్ని పుష్పాలు అర్ధరాత్రి తర్వాత వికసిస్తాయని వాటిని అప్పుడే గుర్తించి సేకరించగలమని చెప్పేవారట. గొప్ప పఠనాభిలాషి. కొన్ని వందల పుస్తకాలను సేకరించారు. ఎన్నో వైద్య గ్రంథాలనూ సేకరించారు. ఆయన పేదవాడైనా వైద్యానికి ఎవరి దగ్గర ఒక్క పైసా తీసుకోలేదు. ఎంతో ఆత్మగౌరవంతో బతికేవారు. దిలావర్ భాయి వంశానికి చెందిన సత్తార్ హుస్సేన్ కుమారుడు ఉస్తాద్ ఖాదర్ మోహియుద్దీన్. ఉస్తాద్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన ఉర్దూ పండితుడు. తెలుగు, సంస్కృతం, అరబ్బీ, పార్సి భాషల్లోనూ మంచి ప్రవేశముండేది. ఉర్దూ, తెలుగుల్లో కవితలు, గీతాలు రాసేవారు. వాటికి తానే స్వరకల్పన చేసేవారు. అసువుగా కవిత్వం చెప్పేవారు. ఒకే సమయంలో అటు ఉర్దూలోనూ ఇటు తెలుగులోనూ అశువుగా కవిత్వం చెప్పేవారు. మొదట ఉర్దూలో చెప్పాక అక్కడ తెలుగు వారుంటే అదే భావాన్ని తెలుగు కవితా రూపంలో చెప్పేవారు. ఇందులో కొన్నిసార్లు విమర్శ లుండేవి. ఆ విమర్శలు చేసేటప్పుడు ధనిక, పేద తేడా లేదు. మనసుకేమనిపిస్తే ఉన్న పళంగా చెప్పేవారు. ఆయన ఏం చెప్పినా తిరుగు ప్రశ్నించే ధైర్యముండేది కాదు. నీతి, నిజాయితీ, ఆత్మగౌరవంతో ఉండేవారు. ఆయన మాట్లాడేటప్పుడు అసంబద్ధంగా ఎవరైనా మాట్లాడితే చీల్చి చెండాడేవారు. ఆయన కోపం లో తిట్టినా ఎవరు ప్రశ్నించేవారు కాదు. ఆనాటి జమీందారులు, షావుకారులూ మినహాయింపు కాదు. ఆయనపై చాలా గౌరవభావం ఉండేది. దానికి తోడు ఆయన ఉన్నత వ్యక్తిత్వం కలవారు. ఆకలితో ఉన్నా ఎవరి దగ్గర చేయి చాచేవారు కాదు. మంచి వక్త, టీచర్ ఉదయగిరి లోని దిలావర్ భాయి వీధిలోని సత్రంలో ఉస్తాద్ పాఠాలు చెప్పేవారు. ఉర్దూ, తెలుగు, లెక్కలు బోధించేవారు. ఈ పాఠశాల సాయంత్రం నడిచేది. ఇందులో పిల్లలు, పెద్దలు అందరూ పాల్గొనేవారు. ఊళ్లో అందరూ చదువు కోవాలని భావించేవారు. అందులో భాగంగానే ఈ ప్రయత్నం చేశారు. ఆయన దగ్గర చదువుకున్న ఒకరిద్దరు ఇప్పటికీ ఆ జ్ఞాపకాలు నెమరు వేసుకుంటున్నారు. ఉస్తాద్ గొప్ప రచయిత ఉస్తాద్ గొప్ప కవి. సంగీత, సాహిత్య ప్రియుడు. రచయిత. ఉర్దూలో, తెలుగులో చాలా పుస్తకాలు రాశారు. ఏ భాషలో రాసినా అక్షరాలు ముత్యాల్లా ఉండేవి. ఆకులు అలములతో ఇంకును, పాళీలను తయారు చేసుకునేవారు. అది ఎలా తయారు చేయాలో కూడా రాసి పెట్టారు. ఆధ్యాత్మిక భావనలతో ఉండేవారు. ఈయన నాటక రచయిత. వీరి కలం పేరు ఖాక్సర్. ఉదయగిరిలో మొదట ఉర్దూలో నాటకాన్ని రాసి తన శిష్యులతో ప్రదర్శించారు. అలాగే వీధి ప్రదర్శనలు చేసేవారు. ముఖ్యంగా మీలాద్- ఏ- నబి (మహా ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జయంతి) రోజున ఆయనపై స్తోత్రాలు రాసి బాణీలు కట్టి శిష్యులతో పాడించేవారు. హజరత్ అబ్దుల్ ఖాదర్ ఖాన్ సా వలి దర్గా వద్ద జరిగే ఉరుసు లోనూ, మొహరం వేడుకల్లోనూ వీధి ప్రదర్శనలు సాగేవి. ఇందులో “కర్బలా ధర్మ యుద్ధం” ఎలా జరిగిందో ఆయా పాత్రధారులతో కళ్ళకు కట్టినట్టు ప్రదర్శించేవారు. ఇది కరుణ రసంతో నిండి ఉండేది. ఉదయగిరి జమీందారు ఛాబు సాబ్ దీన్ని చూసి కంటతడి పెట్టారు. ఈ సందర్భంగా కొన్ని బహుమతులు కూడా ఆయన బృందానికి అందజేశారట. ఉస్తాద్ మంచి గాయకుడు. గాత్ర శుద్ధి ఉండేది. స్వరకర్త. సంగీతంపై మంచి అవగాహన ఉండేది. ఈయన పిల్లలకు సంగీత పాఠాలు నేర్పేవారు. మొదట రాగం పేరు చెప్పి ఎలా పాడాలో పాడి వినిపించేవారు. తర్వాత దానిని అనుసరించమని చెప్పేవారని ఉదయగిరి లోని దిలావర్ భాయ్ వీధికి చెందిన గౌస్ బాషా (89) తెలిపారు. ఆయన రాగాల పేర్లు చెబుతుంటే ఆయనకంతటి సంగీత జ్ఞానం ఎలా అబ్బిందో అర్థం కాలేదని చెప్పుకొచ్చారు. మేము ఈ పాటలను మొహరం సందర్భంలో పాడే వాళ్ళమని గుర్తు చేసుకున్నారు. ఉస్తాద్ శిల్పి, చిత్రకారుడు ఎటువంటి పదార్థాలతో నైనా బొమ్మలను తయారు చేసేవారు. ఆయన ఏ రూపం అనుకుంటే ఆ రూపాన్ని తనకు అందుబాటులో ఉన్న పదార్థాలతో తయారు చేసే వారు. ఉస్తాద్ మంచి చిత్రకారుడు. ఎన్నో చిత్రాలను గీశారు. తను రాసిన చాలా పుస్తకాల్లో చిత్రాలను గీసి వాటికి వివరణ ఇచ్చారు. ఎన్నో సందర్భాల్లో ఈయన చిత్రాలను గీసేవారు. అవి అందర్నీ అబ్బురపరిచేవి. ప్రస్తుతం కొన్ని మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఉస్తాద్ వృత్తిరీత్యా గుర్రపు నాడాల తయారి, చెక్క నగిషీ పనులు చేసేవారు. ఆయన గుర్రపు నాడాను, మేకులను తయారు చేస్తే మెషిన్ లో తయారు చేసినట్లే ఉండేదని ఇప్పటికీ చెప్పుకుంటారు . చెక్క పై నగిషీ చెక్కడం లో నేర్పరి. ఆయన ఏ పని చేసినా అందులో మాస్టర్ (ఉస్తాద్). అయితే వృత్తిని ప్రవృత్తి మించిపోయేది. రోగుల ఇబ్బందుల దృష్ట్యా ప్రవృత్తిగా ఉన్న వైద్యం, మూలిక వైద్య పరిశోధనలపై ఎక్కువ సమయాన్ని కేటాయించారు. ఆయనకు శరీర ధర్మ శాస్త్రం (అనాటమి)పై గొప్ప అవగాహన ఉండేది. దీనికి సంబంధించి కొన్ని పుస్తకాలు ఉర్దూలో రాశారు. అందులో కొన్ని రేఖా చిత్రాలను కూడా గీశారు. శరీరంలో ఏ అవయవం, ఏ పని చేస్తుందో అందులో రాశారు. అక్కడ సమస్యలొస్తే ఏ విధమైన వైద్యం చేయాలో కూడా వివరించారు. ప్రస్తుతం కొన్ని పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఒక మనిషిని చూస్తే అతనికొచ్చిన రోగమేమిటో ఇట్టే కనిపెట్టేవారు. ఆయన దగ్గరకు వచ్చిన రోగులు తమ బాధేమిటో చెప్పుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. అరుదుగానే కొన్ని ప్రశ్నలడిగేవారు. కొన్ని సందర్భాల్లో ఆయనకు తారసపడిన వ్యక్తుల్లో రోగ లక్షణాలు కనిపిస్తే వెంటనే వాటిని చెప్పేవారు. చిన్నదైతే దానికి సంబంధించిన చిట్కాలు తెలిపేవారు. పెద్దదైతే మందు తయారు చేసిచ్చేవారు. ఆయన వెళ్లే దారిలో ఎవరైనా ఉమ్ము ఊసి ఉంటే అక్కడే నిలబడి పోయేవారు. ఆ ఉమ్మును చూసి ఆ మనిషికి వచ్చిన రోగమేమిటో పక్కనున్న వారికి చెప్పేవారు. కొంతమంది రోగులొచ్చినప్పుడు పరిస్థితి చేయి దాటిందని భావిస్తే మందిచ్చేవారు కాదట. ఆ కాలంలోనే కుష్టు వ్యాధికి మందును కనిపెట్టారు. ఆ మందును ఎలా తయారు చేయాలో రాసి ఉంచారు. ఆయన గొప్ప సైకాలజిస్ట్ కూడా. మనోవ్యాధికి మందు లేదనేది పాత సామెత. అయితే కౌన్సిలింగ్ ద్వారా, కొన్ని కిటుకుల ద్వారా దీనిని నయం చేయవచ్చునని నమ్మేవారు. అదే విషయాన్ని ఆయన గ్రంథస్తం చేశారు. ఆ వ్యాధులను ఎలా నయం చేయాలో ఆచరించి చూపారు. కొన్ని వందల వ్యాధులకు ఆయన దగ్గర చికిత్స ఉండేది. ఎప్పటికప్పుడు వాటిని రాసి ఉంచుకున్నారు. పిల్లలు లేని ఎంతో మంది దంపతులకు తన వైద్యంతో సంతాన ప్రాప్తి కలిగేట్లు చేశారు. ఆయన మనవడు హుస్సేన్ భాష ఆయన రాసి ఉంచిన పుస్తకాలను అనుసరించి ఇప్పుడు వైద్యం చేస్తున్నారు. ఆర్.ఎం.పి సర్టిఫికెట్ తో పాటు ఆయుష్ లైసెన్స్ కూడా పొందారు. తాత గారి బాటలోనే ఇప్పటి దాకా మందు ఖరీదైనది అయితే సామగ్రిని తెప్పించుకొని తయారు చేసి ఉచితంగా ఇస్తున్నారు. గొప్ప కవి ఉర్దూలో ఆయన రాసిన కవిత్వం(భక్తి) ఇప్పటికీ ఖసీదాల (భక్తి గేయాల) రూపంలో ఉదయగిరి తదితర ప్రాంతాల్లో ప్రచారంలో ఉంది. తెలుగులోనూ కొన్ని రచనలు చేశారు. కొంతమంది శిష్యులు ఆయన మరణాంతరం పుస్తకాలను తీసుకెళ్లారు. ఆయన సంతానం పుస్తకాలను భద్రపరచడంలో తగిన శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల అవి అందుబాటులో లేకుండా పోయాయి. ఉస్తాద్ పలు భక్తి గీతాలను రాయడమే కాకుండా స్వరాలను కూర్చారు. అవి ఏ సినిమా పాటలకు అనుసరణ కాదు. అందులోని అర్థం ఇప్పటికీ ప్రశంసనీయమే. ఇస్లామిక్ పండితుడు ఉస్తాద్ ఖాదర్ మోహియుద్దీన్ ఇస్లామిక్ పండితుడు. ఖురాన్ (అల్లా వాక్కు) హదీస్ లు (మహా ప్రవక్త మహమ్మద్ స. అ.వ. స. వారి వాక్కు) లను ఇతర ముస్లిం గ్రంథాలను క్షుణ్ణంగా చదివారు. అంతేకాదు భారత, భాగవతాలను కూడా చదువుకున్నారు. ఉర్దూ పండితులతో పాటు తెలుగు పండితులను కూడా కలిసి చర్చించేవారు. ఆనాటి ఉదయగిరి ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువర్యులు హజరత్

గొప్ప పరిశోధకుడు

ఉస్తాద్ ఖాదర్ మోహియుద్దీన్

———————

రచన-ఫయాజ్
———————
(పున్నమి    భలే జ్ఞాపకాలు)

“ఏమయ్యా కొండయ్య?, నేను ఇచ్చిన కాటుక పెట్టుకున్నావా? ఇప్పుడు కళ్ళకు ఎలా కనిపిస్తోంది?”

“చాలా బాగా కనిపిస్తుంద య్యా, ఇంతకు ముందు నా కళ్ళ ముందు రెండు తెరలు అడ్డంగా ఉండి ప్రతి వస్తువు లీలామాత్రం
గానే కనిపించేది. ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేనయ్యా”

ఈ సంభాషణ మీకు అర్థం కాలేదు కదూ?

70 ఏళ్ల కిందట ఉదయగిరిలో జరిగిన సంఘటన ఇది. ఒక వ్యక్తికి రెండు కళ్ళకు కేటరాక్ట్ వచ్చింది. వెంటనే ఉదయగిరి లోని గొప్ప వైద్యుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఉస్తాద్ ఖాదర్
మోహియుద్దీన్ ను సంప్రదించాడు.
ఆయన ఒక కాటుకను తయారు చేసి ఇచ్చారు. దాని మూలంగా కంటి ముందు ఉన్న కాటరాక్ట్ పొరలు తొలగి పోయాయి. చూపు స్పష్టంగా వచ్చింది.

మరో సంఘటన

“ఏమమ్మా రసూల్ బి?, నువ్వు అడిగిన దానికి మందిచ్చా గదా. అది పని చేసిందా?, మళ్లీ
ఎందు కొచ్చావు?”

“అయ్యా మీరిచ్చిన మందు చాలా బాగా పని చేసింది. నా బిడ్డకు కడుపునిండా పాలివ్వగలుగుతున్నా. అయితే పాలిచ్చిన తర్వాత కూడా పాలు ఆగడం లేదు. నా రవిక తడిసిపోతోంది.ఏం చేయాలి”?.

“సరే రేపు రా. దానికి పరిష్కారం చెబుతా.”

ఉదయగిరి లోని దిలావర్ భాయ్ వీధికి చెందిన ఈ మహిళకు కాన్పు తర్వాత పాలు రాలేదు. అందుకని ఆమె ఉస్తాద్ ను సంప్రదించారు.

ఇలా ఉదయగిరి పట్టణంలోనూ, చుట్టుపక్కల బద్వేలు, కనిగిరి, కావలి, ఆత్మకూరు తాలూకాల్లో ఇతర ప్రాంతాల్లో అంతు పట్టని ఏ రోగమొచ్చినా ఉస్తాద్ (గురువు గారు) ని సంప్రదించి ఉచితంగా వైద్యం పొందేవారు. అరుదైన రోగాలకు సైతం ఆయన మందులిచ్చేవారు. ఈ విషయంలో ఆయన కొన్ని పరిశోధనలు సైతం చేశారు. తాను చేసిన పరిశోధనా ఫలితాలను పుస్తకాల రూపంలో రాశారు. ఆయన మూలికల కోసం ఉదయగిరి దుర్గం మీద రెండు మూడు రోజులు ఉండేవారట. కొన్ని పుష్పాలు అర్ధరాత్రి తర్వాత వికసిస్తాయని వాటిని అప్పుడే గుర్తించి సేకరించగలమని చెప్పేవారట. గొప్ప పఠనాభిలాషి. కొన్ని వందల పుస్తకాలను సేకరించారు. ఎన్నో వైద్య గ్రంథాలనూ సేకరించారు. ఆయన పేదవాడైనా వైద్యానికి ఎవరి దగ్గర ఒక్క పైసా తీసుకోలేదు. ఎంతో ఆత్మగౌరవంతో బతికేవారు. దిలావర్ భాయి వంశానికి చెందిన సత్తార్ హుస్సేన్ కుమారుడు ఉస్తాద్ ఖాదర్ మోహియుద్దీన్. ఉస్తాద్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన ఉర్దూ పండితుడు. తెలుగు, సంస్కృతం, అరబ్బీ, పార్సి భాషల్లోనూ మంచి ప్రవేశముండేది. ఉర్దూ, తెలుగుల్లో కవితలు, గీతాలు రాసేవారు. వాటికి తానే స్వరకల్పన చేసేవారు. అసువుగా కవిత్వం చెప్పేవారు. ఒకే సమయంలో అటు ఉర్దూలోనూ ఇటు తెలుగులోనూ అశువుగా కవిత్వం చెప్పేవారు. మొదట ఉర్దూలో చెప్పాక అక్కడ తెలుగు వారుంటే అదే భావాన్ని తెలుగు కవితా రూపంలో చెప్పేవారు. ఇందులో కొన్నిసార్లు విమర్శ లుండేవి. ఆ విమర్శలు చేసేటప్పుడు ధనిక, పేద తేడా లేదు. మనసుకేమనిపిస్తే ఉన్న పళంగా చెప్పేవారు. ఆయన ఏం చెప్పినా తిరుగు ప్రశ్నించే ధైర్యముండేది కాదు. నీతి, నిజాయితీ, ఆత్మగౌరవంతో ఉండేవారు. ఆయన మాట్లాడేటప్పుడు అసంబద్ధంగా ఎవరైనా మాట్లాడితే చీల్చి చెండాడేవారు. ఆయన కోపం లో తిట్టినా ఎవరు ప్రశ్నించేవారు కాదు. ఆనాటి జమీందారులు, షావుకారులూ మినహాయింపు కాదు. ఆయనపై చాలా గౌరవభావం ఉండేది. దానికి తోడు ఆయన ఉన్నత వ్యక్తిత్వం కలవారు. ఆకలితో ఉన్నా ఎవరి దగ్గర చేయి చాచేవారు కాదు.

మంచి వక్త, టీచర్

ఉదయగిరి లోని దిలావర్ భాయి వీధిలోని సత్రంలో ఉస్తాద్ పాఠాలు చెప్పేవారు. ఉర్దూ, తెలుగు, లెక్కలు బోధించేవారు. ఈ పాఠశాల సాయంత్రం నడిచేది. ఇందులో పిల్లలు, పెద్దలు అందరూ పాల్గొనేవారు. ఊళ్లో అందరూ చదువు కోవాలని భావించేవారు. అందులో భాగంగానే ఈ ప్రయత్నం చేశారు. ఆయన దగ్గర చదువుకున్న ఒకరిద్దరు ఇప్పటికీ ఆ జ్ఞాపకాలు నెమరు వేసుకుంటున్నారు.

ఉస్తాద్ గొప్ప రచయిత

ఉస్తాద్ గొప్ప కవి. సంగీత, సాహిత్య ప్రియుడు. రచయిత. ఉర్దూలో, తెలుగులో చాలా పుస్తకాలు రాశారు. ఏ భాషలో రాసినా అక్షరాలు ముత్యాల్లా ఉండేవి. ఆకులు అలములతో ఇంకును,
పాళీలను తయారు చేసుకునేవారు. అది ఎలా తయారు చేయాలో కూడా రాసి పెట్టారు. ఆధ్యాత్మిక భావనలతో ఉండేవారు. ఈయన నాటక రచయిత. వీరి కలం పేరు ఖాక్సర్. ఉదయగిరిలో మొదట ఉర్దూలో నాటకాన్ని రాసి తన శిష్యులతో ప్రదర్శించారు. అలాగే వీధి ప్రదర్శనలు చేసేవారు. ముఖ్యంగా మీలాద్- ఏ- నబి (మహా ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జయంతి) రోజున ఆయనపై స్తోత్రాలు రాసి బాణీలు కట్టి శిష్యులతో పాడించేవారు. హజరత్ అబ్దుల్ ఖాదర్ ఖాన్ సా వలి దర్గా వద్ద జరిగే ఉరుసు లోనూ, మొహరం వేడుకల్లోనూ వీధి ప్రదర్శనలు సాగేవి. ఇందులో “కర్బలా ధర్మ యుద్ధం” ఎలా జరిగిందో ఆయా పాత్రధారులతో కళ్ళకు కట్టినట్టు ప్రదర్శించేవారు. ఇది కరుణ రసంతో నిండి ఉండేది. ఉదయగిరి జమీందారు ఛాబు సాబ్ దీన్ని చూసి కంటతడి పెట్టారు. ఈ సందర్భంగా కొన్ని బహుమతులు కూడా ఆయన బృందానికి అందజేశారట. ఉస్తాద్ మంచి గాయకుడు. గాత్ర శుద్ధి ఉండేది. స్వరకర్త. సంగీతంపై మంచి అవగాహన ఉండేది. ఈయన పిల్లలకు సంగీత పాఠాలు నేర్పేవారు. మొదట రాగం పేరు చెప్పి ఎలా పాడాలో పాడి వినిపించేవారు. తర్వాత దానిని అనుసరించమని చెప్పేవారని ఉదయగిరి లోని దిలావర్ భాయ్ వీధికి చెందిన గౌస్ బాషా (89) తెలిపారు. ఆయన రాగాల పేర్లు చెబుతుంటే ఆయనకంతటి సంగీత జ్ఞానం ఎలా అబ్బిందో అర్థం కాలేదని చెప్పుకొచ్చారు. మేము ఈ పాటలను మొహరం సందర్భంలో పాడే వాళ్ళమని గుర్తు చేసుకున్నారు.

ఉస్తాద్
శిల్పి, చిత్రకారుడు

ఎటువంటి పదార్థాలతో నైనా బొమ్మలను తయారు చేసేవారు. ఆయన ఏ రూపం అనుకుంటే ఆ రూపాన్ని తనకు అందుబాటులో ఉన్న పదార్థాలతో తయారు చేసే వారు. ఉస్తాద్ మంచి చిత్రకారుడు. ఎన్నో చిత్రాలను గీశారు. తను రాసిన చాలా పుస్తకాల్లో చిత్రాలను గీసి వాటికి వివరణ ఇచ్చారు. ఎన్నో సందర్భాల్లో ఈయన చిత్రాలను గీసేవారు. అవి అందర్నీ అబ్బురపరిచేవి. ప్రస్తుతం కొన్ని మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఉస్తాద్
వృత్తిరీత్యా గుర్రపు నాడాల తయారి, చెక్క నగిషీ పనులు చేసేవారు. ఆయన గుర్రపు నాడాను, మేకులను తయారు చేస్తే మెషిన్ లో తయారు చేసినట్లే ఉండేదని ఇప్పటికీ చెప్పుకుంటారు . చెక్క పై నగిషీ చెక్కడం లో నేర్పరి. ఆయన ఏ పని చేసినా అందులో మాస్టర్ (ఉస్తాద్). అయితే వృత్తిని ప్రవృత్తి మించిపోయేది. రోగుల ఇబ్బందుల దృష్ట్యా ప్రవృత్తిగా ఉన్న వైద్యం, మూలిక వైద్య పరిశోధనలపై ఎక్కువ సమయాన్ని కేటాయించారు. ఆయనకు శరీర ధర్మ శాస్త్రం (అనాటమి)పై గొప్ప అవగాహన ఉండేది. దీనికి సంబంధించి కొన్ని పుస్తకాలు ఉర్దూలో రాశారు. అందులో కొన్ని రేఖా చిత్రాలను కూడా గీశారు. శరీరంలో ఏ అవయవం, ఏ పని చేస్తుందో అందులో రాశారు. అక్కడ సమస్యలొస్తే ఏ విధమైన వైద్యం చేయాలో కూడా వివరించారు. ప్రస్తుతం కొన్ని పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఒక మనిషిని చూస్తే అతనికొచ్చిన రోగమేమిటో ఇట్టే కనిపెట్టేవారు. ఆయన దగ్గరకు వచ్చిన రోగులు తమ బాధేమిటో చెప్పుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. అరుదుగానే కొన్ని ప్రశ్నలడిగేవారు. కొన్ని సందర్భాల్లో ఆయనకు తారసపడిన వ్యక్తుల్లో రోగ లక్షణాలు కనిపిస్తే వెంటనే వాటిని చెప్పేవారు. చిన్నదైతే దానికి సంబంధించిన చిట్కాలు తెలిపేవారు. పెద్దదైతే మందు తయారు చేసిచ్చేవారు. ఆయన వెళ్లే దారిలో ఎవరైనా ఉమ్ము ఊసి ఉంటే అక్కడే నిలబడి పోయేవారు. ఆ ఉమ్మును చూసి ఆ మనిషికి వచ్చిన రోగమేమిటో పక్కనున్న వారికి చెప్పేవారు. కొంతమంది రోగులొచ్చినప్పుడు పరిస్థితి చేయి దాటిందని భావిస్తే మందిచ్చేవారు కాదట. ఆ కాలంలోనే కుష్టు వ్యాధికి మందును కనిపెట్టారు. ఆ మందును ఎలా తయారు చేయాలో రాసి ఉంచారు. ఆయన గొప్ప సైకాలజిస్ట్ కూడా. మనోవ్యాధికి మందు లేదనేది పాత సామెత. అయితే కౌన్సిలింగ్ ద్వారా, కొన్ని కిటుకుల ద్వారా దీనిని నయం చేయవచ్చునని నమ్మేవారు. అదే విషయాన్ని ఆయన గ్రంథస్తం చేశారు. ఆ వ్యాధులను ఎలా నయం చేయాలో ఆచరించి చూపారు. కొన్ని వందల వ్యాధులకు ఆయన దగ్గర చికిత్స ఉండేది. ఎప్పటికప్పుడు వాటిని రాసి ఉంచుకున్నారు. పిల్లలు లేని ఎంతో మంది దంపతులకు తన వైద్యంతో సంతాన ప్రాప్తి కలిగేట్లు చేశారు.
ఆయన మనవడు హుస్సేన్ భాష ఆయన రాసి ఉంచిన పుస్తకాలను అనుసరించి ఇప్పుడు వైద్యం చేస్తున్నారు. ఆర్.ఎం.పి సర్టిఫికెట్ తో పాటు ఆయుష్ లైసెన్స్ కూడా పొందారు. తాత గారి బాటలోనే ఇప్పటి దాకా మందు ఖరీదైనది అయితే సామగ్రిని తెప్పించుకొని తయారు చేసి ఉచితంగా ఇస్తున్నారు.

గొప్ప కవి

ఉర్దూలో ఆయన రాసిన కవిత్వం(భక్తి) ఇప్పటికీ
ఖసీదాల (భక్తి గేయాల) రూపంలో ఉదయగిరి తదితర ప్రాంతాల్లో ప్రచారంలో ఉంది. తెలుగులోనూ కొన్ని రచనలు చేశారు. కొంతమంది శిష్యులు ఆయన మరణాంతరం పుస్తకాలను తీసుకెళ్లారు. ఆయన సంతానం పుస్తకాలను భద్రపరచడంలో తగిన శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల అవి అందుబాటులో లేకుండా పోయాయి. ఉస్తాద్ పలు భక్తి గీతాలను రాయడమే కాకుండా స్వరాలను కూర్చారు. అవి ఏ సినిమా పాటలకు అనుసరణ కాదు. అందులోని అర్థం ఇప్పటికీ ప్రశంసనీయమే.

ఇస్లామిక్ పండితుడు

ఉస్తాద్ ఖాదర్ మోహియుద్దీన్
ఇస్లామిక్ పండితుడు. ఖురాన్ (అల్లా వాక్కు) హదీస్ లు (మహా ప్రవక్త మహమ్మద్ స. అ.వ. స. వారి వాక్కు) లను ఇతర ముస్లిం గ్రంథాలను క్షుణ్ణంగా చదివారు. అంతేకాదు భారత, భాగవతాలను కూడా చదువుకున్నారు. ఉర్దూ పండితులతో పాటు తెలుగు పండితులను కూడా కలిసి చర్చించేవారు. ఆనాటి ఉదయగిరి ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువర్యులు హజరత్ మీరా సయ్యద్ షా ఈయన గురువు. ఉస్తాద్ కు సర్వమత సమానత్వం పై నమ్మకం ఉండేది. అందరూ కలిసిమెలిసి జీవించాలనేదే ఆయన సిద్ధాంతం. అందువల్లనే ఆయన శిష్యుల్లో చాలామంది హిందువులు కూడా ఉండేవారు. ఆయన సమ కాలీకులైన వెంకటరత్నం, ఆవుల వెంకట్రామయ్య, రామచంద్రయ్య లతో మంచి స్నేహం ఉండేది. వీరితో వేదాంత చర్చల్లో పాల్గొనేవారు. ఆయనకు ప్రధాన శిష్యులైన మౌలా సాహెబ్, రసూల్ సాహెబ్ లతోపాటు ఎందరో శిష్యులు ఉండేవారు. ఆయనను అనుసరించేవారు. జుబ్బా, పైజామా ధరించిన ఉస్తాద్ చామన ఛాయ కలిగి పొడుగ్గా ఉండేవారట. ఆయన బయటికి వెళ్తే ఒక గుడ్డ సంచిలో కొన్ని పుస్తకాలు, మందులు ఉండేవట. ఎవరైనా అప్పటి కప్పుడు మందులడిగితే తన దగ్గర ఉన్నవి తీసిచ్చేవారు.

మౌల్వికి
చెమటలు

ఉస్తాద్ ఖాదర్ మొహియుద్దీన్ ముస్లింలతో పాటు ఎందరో హైందవ సోదరులు అనుచరులుగా శిష్యులుగా ఉండేవారు. ఇందులో రామచంద్రయ్య, నాయి బ్రాహ్మణుడు. ఆయన దగ్గర క్షవరం చేయించుకోవడానికి ఉదయగిరి షామీర్ షా వీధికి చెందిన మౌల్వి అబ్దుల్ బాసిద్ ఆయన దగ్గరికి వెళ్లేవారు. రామచంద్రయ్య క్షవరం చేసేటప్పుడు ఇస్లామిక్ విషయాలను ఆయన దగ్గర చర్చించేవాడు. అవి విని మౌల్వికి ఆశ్చర్యం కలిగేది. ఒకసారి ఆయన ఇలా అన్నారు. “ఇస్లాంపై ఇంత అవగాహన ఉన్న నువ్వు, ఎందుకు ముస్లిం కాలేదని” ప్రశ్నించారు. అది విన్న రామచంద్రయ్య, “నేనెప్పుడో ముస్లింని అయ్యా. మీరు మాల్వి కదా, మీరు ముస్లిం అయ్యానని భావిస్తున్నారా”? అన్నాడు. “అదేమిటి నేను ముస్లింనే కదా” అన్నారు మౌల్వి. “మీరు ముస్లిం కుటుంబంలో పుట్టినంత మాత్రాన ముస్లిం అయ్యానని భావిస్తున్నారా?, అది సరికాదు. ఒకసారి మీ ముస్లిం మేధావులతో మాట్లాడి ఇప్పటికైనా ముస్లిం కండి” అని యధాలాపంగా అన్నాడు. దాంతో మౌల్వి అబ్దుల్ బాసిద్ కు చెమటలు పట్టాయి. అప్పటికే ఆయన చెన్నైలోని ప్రఖ్యాత ముద్రసాలో చదువును పూర్తి చేశారు. సమాజంలో ఇస్లామిక్ పండితుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అటువంటి తనను పట్టుకొని ఎంత మాటనేశాడని మదన పడిపోయారు. ఈ విషయం తేల్చుకోవడానికి చెన్నైలోని ఇస్లామిక్ పండితులను కలిశారు. రామచంద్రయ్య తనతో చెప్పిన మాటల్ని వాళ్ళ ముందు పెట్టారు. నిజమే, మీకు ఇంకా అంతర్ జ్ఞానం అబ్బ లేదని సెలవిచ్చారు పండితులు. దాంతో ఆయన తన లోపాన్ని సరిదిద్దుకున్నారు. ఉదయగిరి తిరిగి వచ్చి ”
మీ గురువు ఎవరని” రామచంద్రయ్యను అడిగారు. అప్పుడు రామచంద్రయ్య, ఉస్తాద్ ఖాదర్ మోహియుద్దీన్ వద్దకు తీసుకెళ్లాడు. వారిద్దరూ కలిసి పలు ఆధ్యాత్మిక విషయాలను చర్చించారు. తద్వారా తన లోపాన్ని సవరించుకోగలిగారు. అప్పటినుంచి ఆయనకు
ఉస్తాద్ పై
గురుభావం ఏర్పడింది.

బాణసంచాపై పరిశోధన

80 ఏళ్ల కిందటే బాణసంచాపై ఉస్తాద్ పరిశోధన చేశారు. చేసిన పరిశోధనను తనే స్వయంగా ప్రయోగించి ఉదయగిరి వాసులను అబ్బుర పరిచారు. ఉదయగిరిలో మొహరం వేడుకలు అప్పట్లో ఘనంగా
జరిగేవి. సంగీత, నృత్యాలు ఇతర రూపకాలను ప్రదర్శించేవారు. మొహరం వేడుకల్లో “బాదులాస”పీర్ ఊరేగింపు ఒక ప్రత్యేకతతో నిండి ఉండేది. దానికి కారణం ఉస్తాద్. బాదులాస పీర్ రూపాన్ని లోహంతో తయారు చేసేవారు. దానిని కాగితం ఇతర పదార్థాలతో తయారు చేసిన బెలూన్ పైన ఉంచేవారు. ఆ బెలూన్ కింద ఒక పెద్ద దీపాన్ని ఉంచి వెలిగించేవారు. అది వెలిగేటప్పుడు ఒక విధమైన రంగు కలిగిన పొగ ఆ బెలూన్ లోకి వెళ్ళేటట్లు చేసేవారు. ఆ బెలూన్ పొగతో నిండిపోగానే ఆకాశంలోకి ఎగిరిపోయేది. ఎంతలా అంటే దాని ఆచూకీ కనిపించేది కాదు. బహుశా కొండల్లోకి వెళ్లి ఉంటుందని అంచనా వేశారు. సహజంగా హీలియం గ్యాస్ తో బెలూన్లు ఎగురుతాయని మనకు తెలుసు. కొన్ని పదార్థాలతో గ్యాస్ ను ఉత్పత్తి చేసి ఆకాశంలోకి పంపడం అప్పట్లో చాలా ఆశ్చర్యంగా ఉండేది. ఇది ఆయన పరిశోధన. అలాగే బాణసంచా కాల్చేటప్పుడు ఏ రంగు రావాలంటే ఏ పదార్థాలను జోడించాలో ఒక పుస్తకంలో రాశారు. ప్రస్తుతం బాణసంచా కర్మగారాన్ని నిర్వహిస్తున్న బాష మొహిద్దిన్ అనే యువకుడు ఆయన చేసిన ప్రయోగాలు తెలుసుకొని ఆశ్చర్యపోయాడు. తనకు తెలిసి 20 ఏళ్ల కిందటి వరకు కూడా వైలెట్ (ఊదా) కలర్ బాణసంచాలో వచ్చేది కాదని చెప్పాడు. ఆయన రాసిన రంగులు ఊహకు అందనివని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు.

భూత ప్రేత పిశాచాలపై అదుపు

ఉస్తాదుకు భూత ప్రేత పిశాచాలపై అదుపు ఉండేది. ఆ కాలంలో దుష్టశక్తులు ఆవరించిన వ్యక్తులు ఈయనను ఆశ్రయించేవారు. వారికి ఆ బాధ నుంచి
ఉస్తాద్ విముక్తి కల్పించేవారు. ఒకసారి ఆయన శ్రీమతి ఖాతూన్ బి “మీరు నాకు దయ్యాన్ని చూపిస్తారా?” అని ఆసక్తిగా అడిగారు. “నువ్వు ఒక్కదానివే చూడలేవు. ఎవరినైనా తోడు తెచ్చుకో, నేను మన ఇంటి ముందున్న వేపచెట్టు మీదికే పిలిపిస్తా”నని అన్నారు. దాంతో ఆమె ఇంకొకరిని తోడు తెచ్చుకున్నారు. ఉస్తాద్ చెప్పినట్లుగానే దెయ్యాన్ని తమ ఇంటి ముందున్న వేపచెట్టు కొమ్మ మీద కూర్చోబెట్టారు. జుట్టు విరబోసుకొని ఉన్న ఆమెను చూడగానే వీళ్ళు హతాసులయ్యారు. ఇక మేము చూడమన్న తర్వాత దాన్ని వెనక్కి పంపారు. ఇది నమ్మశక్యం కాని విషయం. ఆయన దెయ్యాన్ని ఎలా పిలవాలి? ఏమేం ఏర్పాట్లు చేయాలి?. ఎలాంటి మంత్రాలు చదవాలి అనే విషయాలను ఒక పుస్తకంలో బొమ్మలతో సహా గీసి, రాసి పెట్టారు. అలాగే భూత ప్రేతాలు ఆవరించిన వారికి పరిష్కారం ఎలా చూపాలో కూడా రాశారు. ఈ విషయాలన్నిటిని గ్రంథస్తం చేయబట్టే ఇప్పుడు నమ్మగలిగే పరిస్థితుల్లో ఈ విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నాను.

ముగింపు

ఉస్తాద్ , క్యాన్సర్ (రాచపండు) కు మందు కోసం పరిశోధనలు ప్రారంభించారు. వ్యాధిని నియంత్రించే వరకు వెళ్లారు. ఈలోగా ఆయనకు క్యాన్సర్ సోకింది. దాన్ని కొంతకాలం నివారించారు. నెల్లూరులో అప్పటి ప్రఖ్యాత వైద్యుడు డాక్టర్ రామచంద్ర రెడ్డి తాను చికిత్స చేస్తానని చెప్పారు. అందులో భాగంగా ఆయనకు ఆపరేషన్ (శస్త్ర చికిత్స) చేశారు. అయితే అది ఫలించలేదు. 1955 మే 15వ తేదీన ఉస్తాద్ తనువు చాలించారు. దీంతో జ్ఞాన ధనుడి ప్రయోగాల పరంపరకు కుల్ స్టాప్ పడింది. ఉదయగిరి వాసులే కాదు చుట్టుపక్కల ప్రాంతాల ఆయన శిష్యులు, అభిమానులు ఉదయగిరి చేరుకొని కడసారి దర్శనం చేసుకున్నారు. ఘనంగా నివాళులు అర్పించారు. ఉదయగిరిలో పుట్టి అపార జ్ఞానాన్ని పొందిన ఉస్తాద్ ను కోల్పోయామని చాలా బాధపడ్డారు. అటువంటి మహనీయుని మళ్ళీ చూడగలమా అని ఇప్పటికీ ఆ తరం వారు గుర్తు చేసుకుంటారు.
(ఉస్తాద్ ఖాదర్ మొహియుద్దీన్, రచయిత ఫయాజ్ కు తాతగారు. అమ్మగారి తండ్రి)
8886833033.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.