బిక్కవోలు, సెప్టెంబర్ 22 (పున్నమి ప్రతినిధి): ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ సేవా సమితి బిక్కవోలు మండల శాఖ ఆధ్వర్యంలో సంస్థ సభ్యులు, బిక్కవోలు తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త చోడవరపు రాంబాబు, సత్యవతి దంపతుల కుమారుడు చోడవరపు రాజా పుట్టినరోజు సందర్భంగా మంగళవారం అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు.
బిక్కవోలులోని శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆలయానికి వచ్చిన భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ సేవా సమితి బిక్కవోలు మండల శాఖ అధ్యక్షులు, రాష్ట్ర సేవా రత్న అవార్డు గ్రహీత, పున్నమి ప్రతినిధి సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు, శ్రీమతి సిరిసిపల్లి మణికుమారి, సంస్థ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డా. పెదపాటి విష్ణు రాజాకు సంస్థ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.


