Thursday, 24 September 2026
  • Home  
  • వడిశలేరులో రూ.2.84 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం
- తూర్పు గోదావరి

వడిశలేరులో రూ.2.84 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం

రంగంపేట, సెప్టెంబర్ 22 (పున్నమి ప్రతినిధి): రంగంపేట మండలం వడిశలేరులో రూ.2.84 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న రెండు బీటీ రోడ్డు నిర్మాణ పనులకు రాజమహేంద్రవరం ఎంపీ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అనపర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి నల్లమిల్లి మనోజ్‌రెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు. వడిశలేరు గ్రామానికి ఏడీబీ రోడ్డు నుంచి వడిశలేరు వరకు రూ.84 లక్షలతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు తొలుత శంకుస్థాపన చేశారు. అనంతరం ఆర్‌పీ గూడెం నుంచి తూర్పుగోనగూడెం వరకు వయా వడిశలేరు రూ.2 కోట్లతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో రహదారి సౌకర్యాల అభివృద్ధికి చేపడుతున్న పనులతో ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయని నాయకులు తెలిపారు. కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ కూటమి నాయకులు, రంగంపేట మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, వడిశలేరు గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రంగంపేట, సెప్టెంబర్ 22 (పున్నమి ప్రతినిధి): రంగంపేట మండలం వడిశలేరులో రూ.2.84 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న రెండు బీటీ రోడ్డు నిర్మాణ పనులకు రాజమహేంద్రవరం ఎంపీ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అనపర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి నల్లమిల్లి మనోజ్‌రెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు.

వడిశలేరు గ్రామానికి ఏడీబీ రోడ్డు నుంచి వడిశలేరు వరకు రూ.84 లక్షలతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు తొలుత శంకుస్థాపన చేశారు. అనంతరం ఆర్‌పీ గూడెం నుంచి తూర్పుగోనగూడెం వరకు వయా వడిశలేరు రూ.2 కోట్లతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో రహదారి సౌకర్యాల అభివృద్ధికి చేపడుతున్న పనులతో ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయని నాయకులు తెలిపారు.

కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ కూటమి నాయకులు, రంగంపేట మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, వడిశలేరు గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.