Tuesday, 22 September 2026
  • Home  
  • కలిగిరి పెద్ద చెరువు నుంచి అనుమతులు లేకుండా గ్రావెల్ తరలింపు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కలిగిరి పెద్ద చెరువు నుంచి అనుమతులు లేకుండా గ్రావెల్ తరలింపు

కలిగిరి మండల కేంద్రంలోని పెద్ద చెరువు నుంచి గ్రావెల్ తరలింపు వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. సోమవారం తెల్లవారుజాము నుంచే జేసీబీ, ట్రాక్టర్ల సహాయంతో చెరువు నుంచి గ్రావెల్‌ను తరలిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే చెరువులో తవ్వకాలు చేపట్టి గ్రావెల్ తరలిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయాన్ని ఇరిగేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అయితే, అనుమతులు లేవని చెప్పినప్పటికీ గ్రావెల్ తరలిస్తే ఎలాంటి ఇబ్బంది లేదన్నట్లుగా కావలి ఇరిగేషన్ డీఈ స్పందించారని స్థానికులు పేర్కొన్నారు. చెరువుల పరిరక్షణ బాధ్యత కలిగిన ఇరిగేషన్ అధికారులే ఈ విధంగా స్పందించడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అనుమతులు లేకుండా చెరువుల్లో తవ్వకాలు జరుగుతున్నాయా? ఒకవేళ అనుమతులు ఉంటే వాటి వివరాలను అధికారులు వెల్లడించాలని వారు కోరుతున్నారు. కలిగిరి పెద్ద చెరువులో జరుగుతున్న గ్రావెల్ తవ్వకాలు, తరలింపుపై ఉన్నతాధికారులు దృష్టి సారించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి,నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.