Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: Breaking

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కొత్తసత్రంలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఘనంగా నవరాత్రి ఉత్సవాలులో ముఖ్యఅతిథిగామన్నెమాల సుకుమార్ రెడ్డి

నెల్లూరు జిల్లా, కావలి రూరల్ మండలం కొత్తసత్రం గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో జరుగుతున్నాయి. ​ఉత్సవాల్లో భాగంగా మంగళవారం నిర్వహించిన భారీ అన్నదాన కార్యక్రమానికి గ్రామ కాపులు, మత్స్యకారుల పిలుపుమేరకు కావలి జనసేన పార్టీ సమన్వయకర్త (ఇన్ఛార్జ్) శ్రీ మన్నెమాల సుకుమార్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ​ముందుగా గ్రామానికి విచ్చేసిన సుకుమార్ రెడ్డి గారికి స్థానిక మహిళలు మంగళ హారతులతో, పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన దేవాలయంలో స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. ​ఈ సందర్భంగా సుకుమార్ రెడ్డి గారు గ్రామ కాపులు, మత్స్యకార సోదరులతో కొద్దిసేపు ముచ్చటించి వారి కుశలప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో నవరాత్రి ఉత్సవాలను అత్యంత భక్తిశ్రద్ధలతో, అందరూ కలిసికట్టుగా నిర్వహించడం అభినందనీయమని ఆయన కొనియాడారు. స్వామివారి ఆశీస్సులు గ్రామంలోని ప్రతి కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ​ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ కాపులు , మత్స్యకార నాయకులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలుపాడులో దాడికి గురైన జనసైనికుడు సుబ్బారావును పరామర్శించిన అళహరి సుధాకర్

దగదర్తి మండలం మనుబోలుపాడుకు చెందిన 62 ఏళ్ల జనసైనికుడు పాలమాని సుబ్బారావుపై అదే గ్రామానికి చెందిన కేదారి సురేష్, కేదారి రమేష్‌లు పొలం వద్ద దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ దాడిలో కొడవలి, గడ్డపారతో కొట్టడంతో సుబ్బారావు పైపెదవికి తీవ్ర గాయమైందని, మోకాలి ఎముక విరిగిందని సమాచారం. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ కావలి నియోజకవర్గ ఇన్‌చార్జి అళహరి సుధాకర్ ఆసుపత్రికి వెళ్లి సుబ్బారావును పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితుడికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు విజ్ఞప్తి.. నిందితులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు వినతి మోకాలి శస్త్రచికిత్సను జాగ్రత్తగా నిర్వహించి, బాధితుడు త్వరగా కోలుకునేలా మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. అనంతరం సీఐతో మాట్లాడి, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జనసేన, లీగల్ సెల్ తరఫున అడ్వకేట్ సర్దార్‌ను సంప్రదించి, బాధితుడికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఘటనపై కేసు నమోదు చేసి, విచారణ ద్వారా నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ఈ సందర్భంగా సాధు శ్రీధర్, జనసేన రాష్ట్ర మత్స్యకార కార్యదర్శి కోడింగారి శ్రీనివాసులు, అల్లూరు మండలంలో తెలియని బాబాయ్ తదితరులు బాధితుడిని పరామర్శించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దగదర్తి మండలం చెన్నూరు గ్రామంలో ఘనంగా విజయదశమి వేడుకలు

చెన్నూరు: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని చెన్నూరు గ్రామంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, వేదమంత్రాలు, సంప్రదాయ పూజా కార్యక్రమాలతో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. విజయదశమి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, భక్తులు అమ్మవారి కృపతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. విజయదశమి వేడుకలు భక్తుల సందడి మధ్య ఘనంగా జరిగాయి.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దగదర్తి ఎస్సై మహేంద్ర ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్‌.. త్రిశూల్ కార్యక్రమంపై అవగాహన

నెల్లూరు జిల్లా దగదర్తి మండలంలోని ఎస్సీ కాలనీలో దగదర్తి పోలీస్ స్టేషన్ ఎస్సై మహేంద్ర ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలోని పరిసరాలను పరిశీలించి, ప్రజలకు భద్రతపై అవగాహన కల్పించారు. త్రిశూల్ కార్యక్రమంపై అవగాహన జిల్లా పోలీస్ శాఖ చేపట్టిన ఆపరేషన్ త్రిశూల్ (Operation Trishul) కార్యక్రమంలో భాగంగా మాదకద్రవ్యాల నిర్మూలన, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాల నిర్మూలన: గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. మహిళల భద్రత: మహిళల పట్ల వేధింపులకు పాల్పడకుండా, మహిళల రక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలిపారు. రోడ్డు భద్రత: ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని సూచించారు. ప్రజల భద్రతే పోలీసుల లక్ష్యం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రంగసముద్రం గ్రామం నడిబొడ్డున ప్రమాదకరంగా బావి!

ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించాలి.. ప్రజల భద్రతకు చర్యలు తీసుకోవాలి! రంగసముద్రం గ్రామం నడిబొడ్డున ప్రమాదకర స్థితిలో ఉన్న బావి.. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన! నెల్లూరు జిల్లా దగదర్తి మండలం రంగసముద్రం గ్రామంలో ఊరి మధ్యలో ఉన్న బావి ప్రమాదకర స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. గ్రామం నడిబొడ్డున ఉండటంతో అటుగా వెళ్లే ప్రజలు, చిన్నారులకు ప్రమాదం పొంచి ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ⚠️ ప్రమాదం జరగకముందే చర్యలు తీసుకోవాలి! గ్రామంలో ప్రజలు నిత్యం రాకపోకలు సాగించే ప్రాంతంలో బావి ప్రమాదకరంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి బావి పరిస్థితిని పరిశీలించాలని గ్రామస్థులు కోరుతున్నారు. బావి చుట్టూ పటిష్టమైన రక్షణ గోడ ఏర్పాటు చేయడంతో పాటు, ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అవసరమైతే బావిని సురక్షితంగా మూసివేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 📢 అధికారుల దృష్టికి గ్రామస్థుల విజ్ఞప్తి ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే.. ప్రమాదం జరగకముందే నివారణ చర్యలు తీసుకోవడం అవసరం. రంగసముద్రం గ్రామంలోని బావి పరిస్థితిపై పంచాయతీ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు తక్షణమే స్పందించి ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు. ప్రజల ప్రాణ భద్రతే ముఖ్యం.. అధికారులు వెంటనే స్పందిస్తారా?

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నందిపాడు సెంటర్‌లో తప్పిన పెను ప్రమాదం

నందిపాడు అక్టోబర్ 10-2026(పున్నమి ప్రతినిధి ) దుత్తలూరు మండలం, నందిపాడు సెంటర్‌లో రోడ్డు ప్రమాదం తృటిలో తప్పింది. బద్వేల్ వైపు వెళ్తున్న కారును, దుత్తలూరు వైపు వేగంగా వెళ్తున్న బత్తాయి లారీ ఢీకొట్టినట్లు సమాచారం. వేగంగా వచ్చిన లారీ ముందుగా రోడ్డు మధ్యలోని స్పీడ్ డివైడర్‌ను ఢీకొట్టి, అనంతరం కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు తీవ్రంగా దెబ్బతింది. ప్రమాదం జరిగిన తర్వాత లారీని ఆపకుండా వెళ్లడంతో సంబంధిత పోలీసులకు సమాచారం అందించారు. దీంతో దుత్తలూరు పోలీసులు లారీని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనతో నందిపాడు సెంటర్‌లో వాహనాల వేగ నియంత్రణ, రోడ్డు భద్రతపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రకాశం

ప్రాజెక్టు వర్క్‌ను ప్రదర్శిస్తున్న ఆకుపాటి నోహిత్

పామూరు: మార్కాపురం జిల్లా పామూరు మండలంలోని ఆల్ఫా లిటిల్ కింగ్డమ్ స్కూల్‌లో నిర్వహించిన 7వ స్టూడెంట్ లీడ్ కాన్ఫరెన్స్‌లో విద్యార్థి ఆకుపాటి నోహిత్‌ తన ప్రతిభను చాటుకున్నారు. లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్ (జీవులు, నిర్జీవులు) అంశాలపై రూపొందించిన ప్రాజెక్టు వర్క్‌ను ప్రదర్శించి, వాటి గురించి వివరించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడం, వారిలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. విద్యార్థులు తాము నేర్చుకున్న అంశాలను ఆచరణాత్మకంగా వివరిస్తూ, ఇతరుల ముందు ధైర్యంగా మాట్లాడే నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో లీడ్ అకడమిక్ అడ్వైజర్ రహమాన్ ఖాన్, ప్రిన్సిపాల్ జయరామిరెడ్డి, ఇన్‌చార్జి బిందు థామస్ పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నందిపాడులో వృద్ధురాలు అనుమానాస్పద మృతి

దుత్తలూరు Date :07-10-2026 దుత్తలూరు మండలం నందిపాడు గ్రామంలో పుల్లమ్మ(70) అనే వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. బుధవారం ఉదయం శ్రీరాం నగర్డ్ రోడ్ సమీపంలో మృతదేహం పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. మృతదేహం సమీపంలో కారు అవశేషాలు/గుర్తులు ఉన్నట్లు కనిపించడంతో ఆమె మృతి ప్రమాదమా? లేక మరేదైనా కారణమా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.సంఘటన స్థలానికి చేరుకున్న SI సుభాషిణి దర్యాప్తు చెప్పాట్టారు , ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఉస్మాన్ – పున్నమి రిపోర్టర్, నందిపాడు Uploaded Video:

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దగదర్తి మండలం దుండిగం గ్రామపంచాయతీ లోని ఎస్ఎంసి ఎన్నికలు

నెల్లూరు జిల్లా దగదర్తి మండలం దుండిగం గ్రామపంచాయతీ పరిధిలోని ఎస్ఎంసి ఎన్నికలు జరిగాయి. మండల ఇన్చార్జ్ పమిడి రవికుమార్ చౌదరి ఆదేశాల మేరకు దుండుగం టిడిపి నాయకులు నేలపాటి సుబ్బానాయుడు నియమించిన అభ్యర్థులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చైర్మన్ గా దేవరపాటి మాధురి ఎన్నికయ్యారు మరియు ఇదే గ్రామ పంచాయతీలోని మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాల చైర్మన్ గా దేవరపాటి నరేష్ మరియు వైస్ చైర్మన్ గా ఉసురుపాటి మహేంద్ర ఎన్నికయ్యారు. ఎన్నికల విషయం గురించి మండల ఇన్చార్జి మాట్లాడుతూ నేలపాటి సుబ్బానాయుడు విద్యార్థుల కు మరియు వారి తల్లిదండ్రులకు మౌలిక వసతులు కల్పించి ఎన్నికలు సజావుగా జరిగేలా చేపట్టారని తెలిపారు. ఈ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఉసురుపాటి సుధాకర్, దేవరపాటి అశోక్, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దగదర్తి మండలం జాతీయ రహదారి లైన్స్ నగర్ వద్ద రోడ్డు ప్రమాదం

దగదర్తి మండల పరిధిలోని లైన్స్ నగర్ జాతీయ రహదారి వద్ద 30-09-2026 తేదీన రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. దగదర్తి పోలీస్ ఎస్సై మహేంద్ర సమాచారం అందిన వెంటనే ప్రమాద స్థలానికి రావటం జరిగింది. ఎస్ఐ గారు ఇచ్చిన సమాచారాలు మేరకు నెల్లూరు నుంచి కావలి వైపుగా వెళుతూ ముందు ఆగి ఉన్న బస్సును ఢీ కొన్న లారీ డ్రైవర్ ఒబ్బన హలీ గా తెలిపారు ఇతను కర్ణాటక చెందిన వ్యక్తిగా ఇతను వయసు 48 సంవత్సరాలు ఉంటుందని ఎటువంటి ప్రాణం నష్టం జరగలేదని చిన్నపాటి గాయాలతో బయటపడ్డారని చెప్పారు. తర్వాత 108 ఫోన్ చేసి చికిత్స నిమిత్తం హాస్పటల్ కి తరలించారు. ఇంకా వివరాలు తెలియాలి.