Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: Breaking

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు జిల్లా విద్యా టాస్క్ ఫోర్స్ బృందం పాఠశాల సందర్శన

నెల్లూరు జిల్ల్లా విద్యా టాస్క్ ఫోర్స్ బృందం పాఠశాల సందర్శన నెల్లూరు జిల్లా సంఘం మండలంతరుణవాయిమోడల్ ప్రాథమిక పాఠశాలను జిల్లా విద్యా టాస్క్ ఫోర్స్ బృంద సభ్యులు శ్రీ *సమీర్* గారు, శ్రీ *హరిబాబు* గారు సందర్శించారు. ఈ సందర్భంగా M.E.O.-2 శ్రీ మల్లయ్య గారు కూడా పాల్గొన్నారు.విద్యార్థుల బోధన–అభ్యసన ప్రక్రియ, పఠన సామర్థ్యాలు, విద్యా ప్రమాణాలు, పాఠశాల రికార్డులు, సంసిద్ధత బుక్స్, వర్క్‌బుక్‌లు, సమగ్ర ప్రగతి కార్డులు మరియు మూల్యాంకన పుస్తకాలను పరిశీలించారు.విద్యార్థుల పఠన సామర్థ్యాలు, విద్యా ప్రమాణాలు, అలాగే గైర్హాజరైన విద్యార్థుల కోసం ఉపాధ్యాయులు చేపడుతున్న ఫోన్ ద్వారా సంప్రదింపులు, గృహ సందర్శనల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.విద్యార్థుల అభ్యసన ప్రగతిని మరింత సమర్థవంతంగా నమోదు చేసే దిశగా విలువైన సూచనలు, మార్గదర్శకాలను అందించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు రవాణా శాఖ ఎన్ఫోర్స్మెంట్ ఎం వి ఐ గోపీనాయక్ సస్పెన్షన్

కావలి ముసునూరు జాతీయ రహదారి టోల్ ప్లాజా వద్ద వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే.గోపీనాయక్ కు సహకరించిన ఇద్దరూ చలం కుమార్, ఎన్ శ్రీనివాసులను మాతృశాఖ పోలీస్ శాఖకు బదిలీ చేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నందిపాడులో భారీ వర్షం – ఉక్కపోత నుంచి ప్రజలకు ఊరట

​దుత్తలూరు, సెప్టెంబర్ 7: దుత్తలూరు మండలం నందిపాడులో భారీ వర్షం – ఉక్కపోత నుంచి ప్రజలకు ఊరట కడప, నెల్లూరు జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో కొన్ని రోజులుగా అలుముకున్న తీవ్రమైన ఎండలు, ఉక్కపోత నుంచి నందిపాడు గ్రామ ప్రజలకు వర్షం భారీ ఉపశమనం కలిగించింది. గత కొంతకాలంగా మండుతున్న ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోయిన స్థానికులకు ఈ వర్షం చల్లటి వాతావరణాన్ని తెచ్చిపెట్టింది. ​రాత్రి వేళ ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది సుమారు రాత్రి 11.15Pm నుండి గంటపాటు పడిన ఈ వర్షానికి ప్రధాన వీధులు జలమయమయ్యాయి. వేసవిని తలపించే వాతావరణం నుంచి ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

ప్రకాశం

దారా ఏసుబాబుకు ఘనంగా నివాళులు

పామూరు, సెప్టెంబర్ 7 (పున్నమి ప్రతినిధి): విజయవాడ పట్టణంలోని కుమ్మరిపాలెం సెంటర్‌ వద్ద కొట్టేటి కోటయ్య వీధిలో దారా ఏసుబాబు ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని సోమవారం కుటుంబ సభ్యులు, స్నేహితులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసుబాబు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన స్నేహితులు కేక్‌ కట్‌ చేసి, ఏసుబాబుతో తమకున్న ఆత్మీయ అనుబంధాన్ని, ఆయనతో కలిసి గడిపిన మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి పలువురికి భోజనం అందించారు. ఈ సందర్భంగా ఏసుబాబు సేవలు, స్నేహపూర్వక స్వభావాన్ని స్మరించుకుంటూ స్నేహితులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, స్థానికులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వినాయక మండపాలకు పోలీసుల సూచన

వినాయక చవితి సందర్భంగా మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని కొండాపురం ఎస్‌ఐ కాసుల శ్రీనువాసులు గారు . ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతి లేకుండా వినాయక మండపాలు ఏర్పాటు చేయరాదు.మండపాల ఏర్పాటుకు ముందుగానే పోలీస్‌ అనుమతి తప్పనిసరి. నిర్వాహకులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.శాంతిభద్రతలకు భంగం కలగకుండా నిబంధనలు పాటించాలి.భక్తుల భద్రతకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని భక్తులందరూ సద్వినియోగం చేసుకుని, వినాయక చవితిని ప్రశాంతంగా జరుపుకోవాలని పోలీసులు సూచించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కలిగిరి పెద్దచెరువుపై గ్రావెల్ మాఫియా కన్ను

నెల్లూరు జిల్లా కలిగిరి పెద్దచెరువులో అక్రమ గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.ఆదివారం సెలవు దినాన్ని ఆసరాగా చేసుకుని చెరువులో భారీ యంత్రాలతో గ్రావెల్ తవ్వి,టిప్పర్ల ద్వారా తరలిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.చెరువులో నాలుగు టిప్పర్లు, ఒక 200 హిటాచీ యంత్రం వినియోగిస్తూ గ్రావెల్‌ను వెలికితీసి తరలిస్తున్నట్లు సమాచారం. ఇరిగేషన్ కార్యాలయానికి ఎదురుగానే ఈ తవ్వకాలు జరుగుతున్నప్పటికీ అధికారులు అడ్డుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.