Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

ఎన్నికల విధులను బాధ్యతగా నిర్వహించాలి..రిటర్నింగ్ అధికారి సి.హెచ్. నాగరాజు

Punnami Newsroom Published:
ఎన్నికల విధులను బాధ్యతగా నిర్వహించాలి..రిటర్నింగ్ అధికారి సి.హెచ్. నాగరాజు

ఎన్నికల విధులను బాధ్యతగా నిర్వహించాలి..రిటర్నింగ్ అధికారి సి.హెచ్. నాగరాజు

దగదర్తి మండలం లో స్థానిక జెడ్పీ టీసీ,ఎంపీటీసీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు అందరూ అధికారులు బాధ్యతతో విధులు నిర్వహించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీ సి. హెచ్. నాగరాజు కోరారు.మంగళవారం మండలంలోని ఎంపీడీవో కార్యాలయం నందు ఎన్నికలకు నియమించిన అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా పరిషత్,మండల పరిషత్ లకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైందని,ఈ నెల 21 నుండి 23 వరకు ఉదయం 10.30 నుండి సాయంత్రం 5.00 లోగా నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు.మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం నందు ఏర్పాటుచేసిన కేంద్రం నందు రాష్ట్ర ఎన్నికల సంఘం నియమ నిబంధనల ప్రకారం అభ్యర్ధులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేయవచ్చని తెలిపారు.ఎన్నికలు ముగిసేంత వరకు మండలంలో కోడ్ అమల్లో ఉంటుందని,ప్రచారానికి ముందస్తు అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నారు.జోనల్ టీమ్,రూట్ అధికారులు,యం సీ సీ టీమ్,మండల శిక్షకులు,పంచాయతీ కార్యదర్శులు అందరూ వారికి కేటాయించిన విధులను ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం సక్రమంగా నిర్వర్తించాలని తెలిపారు. ఈ సమావేశంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీమతి సి. హెచ్. శ్రీదేవి,తహసిల్దార్ లాజరస్ , ఎస్. ఐ. మహేంద్ర ,వివిధ శాఖల అధికారులు,పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

ఎన్నికల విధులను బాధ్యతగా నిర్వహించాలి..రిటర్నింగ్ అధికారి సి.హెచ్. నాగరాజు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *