నర్సీపట్నం, పున్నమి ప్రతినిధి ఆనంద్ :
స్కూల్ హెల్త్ అండ్ వెల్‌నెస్ కార్యక్రమంలో భాగంగా సమిద స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో, యూనిసెఫ్, మహిత మరియు ఆలియన్స్ ఫర్ చైల్డ్ రైట్స్ సంస్థల సహకారంతో యువ మిత్ర రాయబారులకు శిక్షణ కార్యక్రమం శనివారం నాడు బలిఘట్టం జడ్‌పీహెచ్ స్కూల్‌లో శిక్షణ అందించారు.
ఈ శిక్షణలో అనకాపల్లి జిల్లాలోని 15 పాఠశాలలకు చెందిన 48 మంది ఎంపిక చేసిన విద్యార్థి, విద్యార్థినులు పాల్గొన్నారు. వారికి బాలల హక్కులు, నాయకత్వ లక్షణాలు, ఆరోగ్యం, బాల్య వివాహాల నిరోధం, బాలల అక్రమ నిరోధం, పౌష్టికాహారం మరియు జెండర్ బ్యాలెన్స్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం పిల్లను గ్రూపులు గా విభజించి పలు అంశాలపై చర్చించుట జరిగింది.
ఈ సందర్భంగా సమిద సంస్థ కార్యదర్శి డి. వీరభద్రరావు, ప్రాజెక్టు ప్రోగ్రాం మేనేజర్ ఎల్.వరాహలాబాబు, సమీద సిబ్బంది ఎస్. సంధ్యరాణి, ఏఎన్‌ఎం లక్ష్మి, కె.నాగేశ్వరరావు, బాల నాగేశ్వరరావు వివిధ పద్ధతుల ద్వారా విద్యార్థులకు శిక్షణ అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు
కె. శ్రీదేవి, ఉపాధ్యాయులు టి.విజయలక్ష్మి, కె.జయలక్ష్మి, ఎస్.నాగేశ్వరరావు, ఎం.మోషెస్ పాఠశాల సిబ్బంది పాల్గొని యువమిత లతో పలు అంశాలపై చర్చించారు.


