ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 57వ డివిజన్లో ప్రజలు అనేక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైనేజీ పనులు ప్రారంభించి ఐదు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ పూర్తికాకపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ స్థంభాల సమస్యలు కూడా ఉన్నాయని, అధికారులు సమస్యలను పరిష్కరించడంలో పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు పున్నమి ప్రతినిధి 57వ డివిజన్లో నిర్వహించిన విజిట్లో అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయి. డ్రైనేజీలు, విద్యుత్ స్థంభాలు, మౌలిక వసతులకు సంబంధించిన సమస్యలను స్థానికులు ప్రతినిధి దృష్టికి తీసుకువచ్చారు. ఎన్నికల సమయంలో మాత్రమే నాయకులు తమ వద్దకు వచ్చి హామీలు ఇస్తారని, ఎన్నికలు ముగిసిన తర్వాత తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.
ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ డివిజన్లో అభివృద్ధి పనులు ఆశించిన స్థాయిలో జరగడం లేదని బీజేపీ 2 టౌన్ ప్రధాన కార్యదర్శి, 57వ డివిజన్ నాయకులు రుద్రగాని మాధవరావు పేర్కొన్నారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన అధికారులను కోరారు.



