Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

30 వేల ఆర్థిక సాయం అండిచిన’మన ధర్మవరం’ గ్రూప్ సభ్యులు,

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
30 వేల ఆర్థిక సాయం అండిచిన’మన ధర్మవరం’ గ్రూప్ సభ్యులు,

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతినిధి ఆనంద్ : ​యలమంచిలి : పాముకాటుకు గురై అకాల మరణం చెందిన ఓ వ్యక్తి కుటుంబానికి స్థానిక యవకులు, స్నేహితులు అండగా నిలిచారు.
  • యలమంచిలిలోని ధర్మవరం వీధికి చెందిన చిక్కాల సురేశ్ సెప్టెంబర్ 6న పాముకాటుకు గురై మృతి చెందారు.
  • కుటుంబ పెద్దను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు 'మన ధర్మవరం' గ్రూప్ సభ్యులు, స్నేహితులు ముందుకొచ్చారు.

పున్నమి ప్రతినిధి ఆనంద్ :

​యలమంచిలి : పాముకాటుకు గురై అకాల మరణం చెందిన ఓ వ్యక్తి కుటుంబానికి స్థానిక యవకులు, స్నేహితులు అండగా నిలిచారు. యలమంచిలిలోని ధర్మవరం వీధికి చెందిన చిక్కాల సురేశ్ సెప్టెంబర్ 6న పాముకాటుకు గురై మృతి చెందారు. కుటుంబ పెద్దను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ‘మన ధర్మవరం’ గ్రూప్ సభ్యులు, స్నేహితులు ముందుకొచ్చారు. ​సభ్యులంతా కలిసి రూ. 30,000 ఆర్థిక సాయాన్ని సేకరించి బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. కష్టసమయంలో తమవంతు సాయంగా ఈ మొత్తాన్ని సమకూర్చినట్లు గ్రూప్ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రూప్ సభ్యులు కొటారు దుర్గారావు, తాటిపాకల చిన్ని, కన్నూరు శేషు, కొటారు శ్యాము తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *