జనగామ మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా ప్రజాపాలన పతాకావిష్కరణ
———————————————————————–
జనగామ మున్సిపల్ కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ప్రజాపాలన పతాకావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గౌరవ మున్సిపల్ చైర్‌పర్సన్, మున్సిపల్ కమిషనర్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, పుర ప్రముఖులు, మున్సిపల్ అధికారులు, కార్యాలయ సిబ్బంది, స్వయం సహాయక సంఘాల మహిళలు (SHG), పారిశుధ్య కార్మికులు, డ్రైవర్లు, ఇతర మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గౌరవ చైర్పర్సన్ కడకంచి బాలమణి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించడమే లక్ష్యంగా మున్సిపల్ యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడం, పట్టణ పారిశుధ్యం, పరిశుభ్రత, ప్రజా ఆరోగ్యం, మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ పనిచేయాలని సూచించారు.
ప్రజాపాలనలో ప్రజల భాగస్వామ్యం, పారదర్శకత, జవాబుదారీతనం మరియు సేవాభావం కీలకమని పేర్కొన్నారు. జనగామ పట్టణ అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది మరియు ప్రజలు సమన్వయంతో పనిచేయాలని కోరారు.
కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, SHG మహిళలు, డ్రైవర్లు తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారని మున్సిపల్ కమీషనర్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు



