భైంసా:ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం, తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను భైంసా మండల బీజేపీ ఆధ్వర్యంలో మండల అధ్యక్షురాలు, దేగాం సర్పంచ్ సిరం సుష్మారెడ్డి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. దేగాం గ్రామంలోని గణేష్ మండపం వద్ద మోదీ ఆయురారోగ్యాల కోసం పూజలు నిర్వహించి, అనంతరం భైంసా ఏరియా ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు, పారిశుధ్య కార్మికులకు బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అలాగే దేగాంలో జాతీయ జెండాను ఆవిష్కరించి విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు భూమేష్, మండల ప్రధాన కార్యదర్శులు సాయినాథ్, ఆకాష్, నాయకులు లింగన్న, కిష్టయ్య, బీజేవైఎం నాయకుడు గంగాప్రసాద్, చంద్రకాంత్ పటేల్, భోజారెడ్డి, పోల్కం సాయినాథ్, నాగన్న తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా మోదీ జన్మదినం, విమోచన దినోత్సవ వేడుకలు