పున్నమి: ఎల్బీనగర్, స్తినాపురం జెడ్పీ రోడ్డులో రిలయన్స్ స్మార్ట్ పాయింట్ సమీపంలో హనీ మోటార్స్ పేరుతో నూతన మల్టీబ్రాండ్ టూ వీలర్ షోరూమ్ ఘనంగా ప్రారంభమైంది. షోరూమ్‌ను యజమాని తాటికొండ సతీష్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దంటు జగన్, యెరుగండ్లపల్లి సర్పంచ్ వొళ్ళమ్ల సంతోష్ యాదవ్ హాజరై షోరూమ్‌ను ప్రారంభించి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా యజమాని తాటికొండ సతీష్ యాదవ్ మాట్లాడుతూ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా వివిధ ప్రముఖ బ్రాండ్లకు చెందిన ద్విచక్ర వాహనాలను ఒకే చోట అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. నాణ్యమైన సేవలు, వినియోగదారుల సంతృప్తికి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, వ్యాపార ప్రముఖులు, స్థానికులు తదితరులు పాల్గొని హనీ మోటార్స్‌కు శుభాకాంక్షలు తెలిపారు.



