స్మైలీ గాయ్స్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా విగ్రహ ప్రతిష్ఠాపన.. భక్తులతో సందడిగా ఏటికొప్పాక
యలమంచిలి , సెప్టెంబర్ 15: పున్నమి ప్రతినిధి ఆనంద్
ఏటికొప్పాక గ్రామంలోని కుమ్మరి వీధిలో వినాయక చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. స్మైలీ గాయ్స్ యూత్ ఆధ్వర్యంలో 12 అడుగుల భారీ వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలతో ప్రతిష్ఠాపన చేశారు. భారీ గణనాథుడి విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. విఘ్నేశ్వరుడి దర్శనం కోసం స్థానికులు, యువత, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గణపతి నామస్మరణతో కుమ్మరి వీధి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు స్మైలీ గాయ్స్ యూత్ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు


