Tuesday, 15 September 2026
  • Home  
  • క్వింటాల్ సీడ్ బాల్స్‌తో 40 అడుగుల పర్యావరణ గణపతి!
- ఖమ్మం

క్వింటాల్ సీడ్ బాల్స్‌తో 40 అడుగుల పర్యావరణ గణపతి!

ఖమ్మం: నగరంలోని బ్రాహ్మణవాడలో వినూత్న రీతిలో గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దేశంలోనే తొలిసారిగా క్వింటాల్ సీడ్ బాల్స్‌తో రూపొందించిన సూర్య ప్రభ వాహన దక్షిణమూర్తి స్వరూప గణపతి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సుమారు 40 అడుగుల ఎత్తులో పర్యావరణహితంగా రూపొందించిన ఈ గణనాథుడు ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. 1994లో కేవలం ఒక అడుగు ఎత్తు విగ్రహంతో ప్రారంభమైన ఈ ఉత్సవ సమితి, 2016 నుంచి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (POP) విగ్రహాలకు స్వస్తి పలికి పర్యావరణహిత విగ్రహాలను ఏర్పాటు చేస్తోంది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా దక్షిణ దిశగా పూజలు అందుకుంటున్న ఏకైక గణపతిగా ఈ విగ్రహానికి ప్రత్యేక గుర్తింపు లభించింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి గణనాథుడిని దర్శించుకుంటున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.