విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆకాంక్షించారు. వినాయక చవితి సందర్భంగా నెల్లూరు సిటీ నియోజకవర్గం 13వ డివిజన్ మిట్టపాలెంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని మంత్రి నారాయణ ప్రారంభించారు. అనంతరం గణనాథుడి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మంత్రికి స్థానిక నాయకులు, గణేశ్ మిత్రమండలి సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి కాలనీలో పర్యటించి స్థానిక ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో పూజించుకునే పవిత్రమైన రోజు వినాయక చతుర్థి పర్వదినమన్నారు. గణనాథుడి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలతో ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.యువత, ప్రజలు ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొంటూనే సామాజిక బాధ్యతను కూడా పాటించాలని సూచించారు. ఇతరులకు ఇబ్బంది కలగకుండా వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా నిర్వహించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ హిమబిందు, నారాయణ విద్యాసంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, స్థానిక టీడీపీ నేతలు కాయల తిరుపతి, ఊటుకూరు చంద్ర, గణేశ్ మిత్రమండలి సభ్యులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

గణనాథుడి ఆశీస్సులతో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలి-మంత్రి నారాయణ.
విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆకాంక్షించారు. వినాయక చవితి సందర్భంగా నెల్లూరు సిటీ నియోజకవర్గం 13వ డివిజన్ మిట్టపాలెంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని మంత్రి నారాయణ ప్రారంభించారు. అనంతరం గణనాథుడి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రికి స్థానిక నాయకులు, గణేశ్ మిత్రమండలి సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి కాలనీలో పర్యటించి స్థానిక ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో పూజించుకునే పవిత్రమైన రోజు వినాయక చతుర్థి పర్వదినమన్నారు. గణనాథుడి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలతో ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.యువత, ప్రజలు ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొంటూనే సామాజిక బాధ్యతను కూడా పాటించాలని సూచించారు. ఇతరులకు ఇబ్బంది కలగకుండా వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ హిమబిందు, నారాయణ విద్యాసంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, స్థానిక టీడీపీ నేతలు కాయల తిరుపతి, ఊటుకూరు చంద్ర, గణేశ్ మిత్రమండలి సభ్యులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

