* నెల్లూరులో శోభాయమానంగా గణేష్ చతుర్థి వేడుకలు – పాల్గొన్న పొంగూరు షరిణి
* గణేష్ మండపాల్లో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి నారాయణ కుమార్తె షరిణి
* ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని విఘ్నేశ్వరుడిని ప్రార్థించా: షరిణి పొంగూరు
నెల్లూరు నగరంలో వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా సాగుతున్న సందర్భంగా, రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కుమార్తె షరిణి పొంగూరు నగరంలోని 16వ డివిజన్ (జగదీష్ నగర్), 8వ డివిజన్ (నజీర్ తోట, ముకుంద పురం), 10వ డివిజన్ (బాబు గిరిజన కాలనీ, ఉస్మాన్ సాహెబ్ పేట), 4వ డివిజన్ (శ్రీనివాస నగర్), మరియు 47వ డివిజన్ (కుక్కలగుంట మహాలక్ష్మి అమ్మవారి గుడి ప్రాంగణం) లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను సందర్శించి ప్రత్యేక అర్చనాదులు నిర్వహించారు; ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, మండప నిర్వాహకులు, టిడిపి శ్రేణులు భారీ స్థాయిలో బాణాసంచా పేల్చి నినాదాలతో ఆమెకు ఘనంగా నీరాజనాలు పలకగా, అనంతరం షరిణి మాట్లాడుతూ జిల్లా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ గణపయ్య దివ్య ఆశీస్సులతో నెల్లూరు ప్రజలంతా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు.

