అనకాపల్లి జిల్లా, సెప్టెంబర్ 13: పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్
ఎస్.రాయవరం మండలం చిన్నగుమ్ములూరు గ్రామంలో తాగునీటి ట్యాంకు నిండిపోయి మంచినీరు వృథాగా రోడ్లపైకి ప్రవహిస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విలువైన తాగునీటిని పొదుపుగా వినియోగించాల్సిన సమయంలో ట్యాంకు నిండిన తర్వాత కూడా నీరు బయటకు పొంగిపొర్లుతూ రోడ్లను తడుపుతోంది. దీంతో నీటి వృథాతో పాటు రహదారిపై నీరు నిలిచి ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సమస్యను గుర్తించి ట్యాంకు వద్ద నీటి ప్రవాహాన్ని నియంత్రించే చర్యలు చేపట్టాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ట్యాంకు పొంగిపొర్లకుండా శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు వృథా అవుతున్న మంచినీటిని అరికట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.


