రామవరం, సెప్టెంబరు 12 (పున్నమి ప్రతినిధి): వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా స్వాతి ప్రమోటర్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ ఆధ్వర్యంలో 50 వేల మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. మట్టి గణపతులను పూజించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించాలనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.
కార్యక్రమంలో భాగంగా రామవరంలో చిన్నారులు, గ్రామస్థులకు మట్టి గణపతి విగ్రహాలను అనపర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. పర్యావరణహిత మట్టి విగ్రహాల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ సంప్రదాయంతో పాటు ప్రకృతి పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్వాహకులు కోరారు.
ఈ కార్యక్రమంలో SPIL సభ్యులు, కూటమి నాయకులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.






