మట్టి గణపతి ప్రతిమలను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. సీహెచ్ కేశవరావు పిలుపునిచ్చారు.
గురువారం గిరిజన మ్యూజియం వద్ద విద్యార్థులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయన ప్రతిమల వల్ల జలాలు కలుషితమవుతాయని తెలిపారు. అనంతరం ర్యాలీ చేసి వ్యాపారులకు మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. ఎన్ఎస్ఎస్ పీఓ విజయలక్ష్మీ, లచ్చన్న, అధ్యాపకులు పాల్గొన్నారు.
Uploaded Video:


