అనకాపల్లి: సెప్టెంబర్ 10 పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్
అనకాపల్లి వర్తక సంఘం రోటరీ ఐ హాస్పిటల్లో ఈరోజు (సోమవారం, 31 ఆగస్టు 2026) ఉదయం డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 9 మంది రోగులకు ఉచితంగా ఐఓఎల్ (కంటి శుక్ల) ఆపరేషన్లు నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా రోగులకు ఉచిత మందులు, కళ్ళజోడు అందజేయడం జరిగింది. రోటరీ క్లబ్ సభ్యులు కే. మురళీకృష్ణ, వి. లక్ష్మణ్ గార్ల చేతుల మీదగా ఈ ఉచిత మందులు, కళ్ళజోడును పంపిణీ చేశారు. ఉప్పల రామకృష్ణ గారి సహకారంతో రొట్టెలు కూడా అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రోటరీ ఐ హాస్పిటల్ చైర్మన్ బుద్ధ రమణాజీ, కో-చైర్మన్ కే. సతీష్, అధ్యక్షుడు సోమ సుందర్, కార్యదర్శి పుష్పం, కుశ్వంత్, మల్లేశ్వరరావు, ఎం. సూరిబాబు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.

