• వత్తలూరు, పెద్దూరు, తిప్పాయపల్లిలో విస్తృతంగా పర్యవేక్షణ
• పేకాట, కోళ్ల పందేలు, గంజాయి స్థావరాలపై ప్రత్యేక దృష్టి
• అనుమానాస్పద కదలికలపై తక్షణ చర్యలకు పోలీసుల సిద్ధం
పుల్లంపేట: అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు రేణిగుంట డీఎస్పీ వై. శ్రీనివాసరావు పర్యవేక్షణలో, కోడూరు రూరల్ సీఐ డి. శ్రీనివాసులు, పుల్లంపేట ఎస్ఐ వి. చిన్నరెడ్డెప్ప ఆధ్వర్యంలో వత్తలూరు, పెద్దూరు, తిప్పాయపల్లి గ్రామాల్లో డ్రోన్ కెమెరాలతో తనిఖీలు చేపట్టారు. గ్రామాలు, శివారు ప్రాంతాలు, అనుమానాస్పద ప్రదేశాలను పరిశీలించారు. పేకాట, కోళ్ల పందేలు, గంజాయి నిల్వలు, వినియోగం, బహిరంగ మద్యం సేవించే ప్రదేశాలపై ప్రత్యేకంగా నిఘా పెట్టారు. డ్రోన్ ద్వారా గుర్తించే అనుమానాస్పద కదలికలపై స్థానిక సిబ్బంది వెంటనే స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. అవసరాన్ని బట్టి మండలంలోని ఇతర గ్రామాల్లోనూ డ్రోన్ నిఘాను విస్తరిస్తామని పోలీసులు తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు.


