Thursday, 10 September 2026
  • Home  
  • జగన్ అహంకారంతోనే చంద్రబాబు అరెస్ట్: సోమిరెడ్డి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జగన్ అహంకారంతోనే చంద్రబాబు అరెస్ట్: సోమిరెడ్డి

జగన్‌రెడ్డి అహంకారంతోనే 2023 సెప్టెంబర్ 9న చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేశారని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపించారు. నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ అందించేందుకు రూ.241 కోట్లు ఖర్చు చేయడాన్ని తప్పుగా చూపించి కేసు పెట్టారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 43 స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాల ద్వారా 2.30 లక్షల మందికి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. చంద్రబాబును 37వ నిందితుడిగా చేర్చి అర్ధరాత్రి అరెస్ట్ చేయడం రాజకీయ కక్షసాధింపేనన్నారు. ఆ ఘటనను ప్రజలు మరచిపోలేదని, ఎన్నికల్లో వైసీపీకి తగిన గుణపాఠం చెప్పారని పేర్కొన్నారు. అరెస్టును నిరసిస్తూ అప్పట్లో దేశవిదేశాల్లో కూడా తెలుగువారు ఆందోళనలు చేపట్టారని, ప్రజాస్వామ్యంలో ఇలాంటి కక్షపూరిత చర్యలకు ఏమాత్రం స్థానం లేదని సోమిరెడ్డి స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.